Brahmamudi serial today Episode: ఆరు నెలలు కోమాలో ఉన్నారా..? వీళ్లేదో ఆయన్ని మాయ చేస్తున్నారు అని బాధపడుతుంది. ఇంతలో డాక్టర్ మీకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల మీరు గతం మర్చిపోయారు అని డాక్టర్ రాజ్‌కు చెప్పడంతో కావ్య బాధపడుతుంది. మా ఆయన గతం మర్చిపోయారా అని ఎమోషనల్ అవుతుంది. గతానికి సంబంధించిన విషయాలు జస్ట్ ఇన్మఫర్మేషన్ ఇచ్చి వదిలేయాలి. అంతేకానీ లోతుగా చెప్పకూడదు అని డాక్టర్ చెప్పగానే.. ఏంటండి మీకు ఈ పరిస్థితి నేను మీ ముందుకు వచ్చినా మీరు నన్ను గుర్తు పట్టలేని పరిస్థితి అనుకుంటుంది. ఇంతలో రాజ్, యామిని అక్కడి నుంచి బయలుదేరుతారు. కావ్య వాళ్లను ఫాలో అవుతుంది. యామిని బావ నిన్ను స్పెషల్ ప్లేస్‌కు తీసుకెళ్తాను అని చెప్తుంది. ఎక్కడికి అని రాజ్ అడగ్గానే.. నీ గతాన్ని నీకు గుర్తు చేయకుండా జస్ట్ చూపిస్తాను అంతే రా బావ అంటూ తీసుకెళ్తుంది. వెనకాలే ఫాలో అవుతున్న కావ్య ఆయన గతాన్ని చూపెడుతుందా..? నాకు తెలియని గతం ఏముంది వెంటనే ఫాలో చేయాలి అని మనసులో అనుకుంటుంది. యామిని, రాజ్‌ను ఫాలో చేస్తుంది.
రూంలో పడుకున్న అపర్ణ దగ్గరకు ఇందిరాదేవి పాలు తీసుకెళ్లి నిద్ర లేపుతుంది. ఎంత పిలిచినా లేవదు. కంగారుగా సుభాష్‌ను పిలుస్తుంది. సుభాష్ వచ్చి అపర్ణను తట్టి లేపినా లేవదు అపర్ణ. ఇంతలో ధాన్యలక్ష్మీ, రుద్రాణి, ప్రకాష్ వస్తారు. అందరూ పిలిచినా అపర్ణ పలకదు. దీంతో రుద్రాణి అనుకున్నా.. ఇలాంటిది ఏదో జరుగుతుందని అనుకున్న.. రాజ్‌కు కర్మకాండలు చేద్దాం అన్నారు. అందరూ నా మాటలు కొట్టి పారేశారు. ఇప్పుడు చూడండి వదిన పరిస్థితి ఎలా తయారైందో.. అంటుంది. దీంతో ప్రకాష్ కోపంగా నువ్వు ఆపుతావా..? వదినకు ఏమైందో అని మేము కంగారు పడుతుంటే మధ్యలో నీ గోల ఏంటి..? అంటాడు. ధాన్యలక్ష్మీ కూడా అక్క సరిగ్గా భోజనం చేసి రెండు రోజులైంది. అందుకేనేమో నీరసం వల్ల ఇలా అయిపోయింది అంటుంది. సుభాష్ పక్కన కూర్చుని ఎంత పిలిచినా అపర్ణ పలకదు. చాలా సేపటికి చిన్నగా కదులుతుంది. ఇందిరాదేవి ఊపిరి పీల్చుకుంటుంది.
మెల్లగా నిద్ర లేచిన అపర్ణ ఏమైంది. ఇక్కడేం చేస్తున్నారు మీరంతా అని అడుగుతుంది. దీంతో రుద్రాణి నువ్వు ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటే ఏమైందోనని అందరూ కంగారు పడుతున్నారు వదిన అంటుంది. దీంతో అపర్ణ ఏడుస్తుంది. అయినా చావు పుట్టుకలు మన చేతుల్లో ఉంటాయా ఏంటి..? మనిషి పోతే పోయాడని నమ్మాలి.. చేయాల్సిన కార్యాలు ఏవో చేయాలి. అంతేకానీ నాకు మాత్రమే ప్రేమ ఉంది. చచ్చిపోయాడంటే నేను నమ్మను అంటూ మాట్లాడితే ఇంట్లో వాళ్ల పరిస్థితి ఇలాగే తయారవుతుంది అనగానే సుభాష్ కోపంగా ఎప్పుడు చూసిన కావ్య మీద పడి ఏడుస్తావేంటి..? అంటాడు. ప్రకాష్ కూడా వాళ్లు అలా చేశారు. వీళ్లు ఇలా చేశారు అనడం కాకుండా.. చేతనైతే వదిన కాస్త ప్రశాంతంగా ఉంచడం నేర్చుకో.. అంటాడు. ధాన్యలక్ష్మీ కూడా నిజానికి నీ మాటలకే అక్క ఎక్కువ కుంగి పోయేలా ఉంది. ఇలాంటప్పుడైనా కాస్త మనిషిలా ఆలోచించు.. కొంచమైనా మానవత్వం చూపించు అంటుంది. దీంతో రుద్రాణి అందరినీ తిట్టి దీని అంతటికి కారణమైన కావ్యను వదిలిపెట్టేదే లేదు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
యామిని, రాజ్ ఒక స్కూల్ దగ్గరకు వెళ్లగానే కావ్య కూడా అక్కడికే వెళ్తుంది. గేటు దగ్గర సెక్యూరిటీ గార్డు కావ్యను లోపలికి వెళ్లనివ్వకపోతే గేటు దగ్గరే నిలబడి ఆలోచిస్తుంది. ఒక ప్లాన్ తట్టగానే.. సెక్యూరిటీకి కహాని చెప్పి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లిన రాజ్ కు యామిని స్కూల్ మొత్తం చూపిస్తుంది. ప్రిన్సిపాల్ రూంలోకి వెళ్లగానే గుర్తు పట్టి లోపలికి పిలుస్తుంది. హలో రామ్.. ఎలా ఉన్నారు..? అని అడుగుతుంది. దీంతో రాజ్ గుడ్ మేడం మీరెలా ఉన్నారు అని అడుగుతాడు. ప్రిన్సిపాల్ చూస్తున్నావుగా స్కూల్ వర్క్‌తో బిజీగా ఉన్నాను. మీరంతా చదువుకుని స్కూల్ వదిలేసి వెళ్లిపోతుంటే కొత్త స్టూడెంట్స్ వస్తారు. అని ప్రిన్సిపాల్ చెప్తుంటే కావ్య కిటికీ దగ్గరకు వచ్చి చూస్తుంది. ఇంతలో యామిని ఏంటి మేడం మీ ఫేవరెట్ స్టూడెంట్ రామ్‌తోనే మాట్లాడతారా..? నాతో మాట్లాడతారా..? అంటుంది.
దీంతో ప్రిన్సిపాల్ నో రామ్ ఎంత తెలివైన స్టూడెంటో.. నువ్వు అంత అల్లరి పిల్లవి.. నిన్ను కంట్రోల్ చేయలేక మీ బావ ఎంత ఇబ్బంది పడేవాడో నాకు బాగా తెలుసు. అలాంటి నిన్ను ఎలా మర్చిపోతాను యామిని. అప్పట్లో నువ్వు క్లాస్ రూంలో థౌజెండ్ వాలా కాల్చావు మాకందరికీ ఇంకా గుర్తుంది అని ప్రిన్సిపాల్ గుర్తు చేయగానే.. యామిని అది మీకు ఇంకా గుర్తు ఉందా మేడం. అని అడుగుతూ.. నీకు గుర్తుందా బావా అని అడగ్గానే.. రాజ్ లేదనడంతో ప్రిన్సిపాల్ అవన్నీ మీ బావకు ఎలా గుర్తు ఉంటాయి అంటుంది. దీంతో కిటికీ లోంచి చూస్తున్న కావ్య మా ఆయన చుట్టు చాలా కట్టుకథలు అల్లుతున్నారు అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ప్రిన్సిపాల్ ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతుంది. యామిని యాక్సిడెంట్ గురించి చెప్పి కొంచెం చేంజ్ కావాలని ఇలా తీసుకొచ్చానని చెప్తుంది. ఇంతలో ప్రిన్సిపాల్ ఒక ఫోటో తీసుకొచ్చి రామ్ నీకు వీళ్లందరూ గుర్తున్నారా..? అని అడుగుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?