BigTV English

Anant ambani padayatra: పాదయాత్రలో కోళ్లు కనిపించాయి.. అనంత్ అంబానీ ఏం చేశారంటే..?

Anant ambani padayatra: పాదయాత్రలో కోళ్లు కనిపించాయి.. అనంత్ అంబానీ ఏం చేశారంటే..?

అనంత్ అంబానీ పాదయాత్ర దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. మొదట్లో మీడియాకు సమాచారం ఇవ్వకుండానే ఈ యాత్ర చేపట్టారు అనంత్. యాత్ర కూడా పూర్తిగా రాత్రిపూట జరగడం, పగలు ఆయన విశ్రాంతి తీసుకుంటుండటంతో దీని గురించి పెద్దగా ప్రచారం జరగలేదు. రోజులు గడిచేకొద్దీ అనంత్ యాత్ర సంచలనంగా మారింది. జడ్ ప్లస్ కేటగిరీ వ్యక్తి ఆధ్యాత్మిక యాత్ర అది కూడా 140 కిలోమీటర్లు కాలి నడకన అంటే సాహసమనే చెప్పాలి. అందులోనూ అనంత్ కి ఓవర్ వెయిట్ తోపాటు, ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. కానీ కుటుంబ సభ్యులెవరూ వెంట లేకుండానే కేవలం వ్యక్తిగత సిబ్బందితోటే అనంత్ యాత్ర మొదలు పెట్టారు. మార్గ మధ్యంలో ఎన్నో వింతలు విశేషాలు. తాజాగా ఓ కోళ్ల ఫామ్ వ్యాన్ అనంత్ అంబానీకి ఎదురొచ్చింది. అప్పుడు అనంత్ ఏం చేశారంటే..?


అనంత్ అంబానీ జంతు ప్రేమికుడు. ఆయనకు పక్షులు, జంతువులంటే ఎంతో ఇష్టం. వాటికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వంతార అనే ప్రైవేట్ జూ ఏర్పాటు చేశాడు. ఆ జూలో జంతువులకోసం ఐసీయూ లాంటి అధునాతన సదుపాయాలున్నాయి. కేర్ టేకర్స్ తోపాటు, జూ లో రిలయన్స్ కంపెనీకి చెందిన పశువుల డాక్టర్లు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అలాంటి అనంత్ కి పాదయాత్రలో ఓ కోళ్ల ట్రక్ కనపడింది. స్థానిక చికెన్ షాప్ లో వాటిని విక్రయించేందుకు ఆ వ్యాన్ లో బయలుదేరాడు ఓనర్. 250 కోళ్లను తీసుకెళ్తున్నాడు. ఆ ట్రక్ తన పాదయాత్రలో కనపడే సరికి అనంత్ ఆగాడు. ట్రక్ యజమానితో మాట్లాడాడు. ఆ కోళ్లన్నీ తానే కొంటాన్నాడు. అసలు అన్ని కోళ్లను అనంత్ అంబానీ ఎందుకు కొంటున్నాడో అక్కడున్నవారికి అర్థం కాలేదు. ఆ తర్వతా అందరికీ అనంత్ షాకిచ్చారు. ఆ కోళ్లను నేరుగా జామ్ నగర్ లోని తన వంతారా జూ కి తరలించమని సిబ్బందిని ఆదేశించాడు. వంతారాలో వాటిని సంరక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పాడు.

సహజంగా మనం సినిమాల్లో కొన్ని సీన్లు చూస్తుంటాం. చిన్న పిల్లల సంతోషం కోసం పావురాల్ని, చిలుకల్ని, లవ్ బర్డ్స్ ని కొని గాల్లోకి ఎగరేస్తుంటారు తల్లిదండ్రులు. కొన్నిసార్లు లవర్ ని ఇంప్రెస్ చేయడానికి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి టెక్నిక్ లే ఫాలో అవుతుంటారు. అయితే విచిత్రంగా అనంత్ అంబానీ కోళ్ల ట్రక్ ని ఆపారు. ఆ కోళ్లను సంరక్షణ కేంద్రానికి తరలించాడు. అనంత్ సున్నిత మనస్సుకి ఇది నిదర్శనం అంటున్నారు ఆయన అభిమానులు, సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.

ఎందుకీ యాత్ర..?
ఈనెల 10వతేదీతో అనంత్ 30వ ఏట అడుగుపెట్టబోతున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా ద్వారకలోని శ్రీకృష్ణ మందిరానికి వస్తానని మొక్కుకున్నారట అనంత్. అది కూడా కాలినడకన వస్తానని అనుకున్నారు. అందుకే 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారకకు జామ్ నగర్ నుంచి కాలి నడకన బయలుదేరారు. రోజుకి ఆయన 15 నుంచి 20 కిలోమీటర్లు యాత్ర చేస్తున్నారు. మార్చి 27న యాత్ర మొదలు పెట్టగా ఏప్రిల్ 10 నాటికి ఆయన ద్వారక చేరుకుంటారు.


రాత్రిపూటే యాత్ర ఎందుకు..?
అనంత్ అంబానీకి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. వారు కాకుండా దాదాపు 100 మంది ప్రైవేట్ సిబ్బంది ఆయన్ను ఫాలో అవుతున్నారు. దీంతో ఈ యాత్ర వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ఆయన కేవలం రాత్రిపూటే యాత్ర చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు. పగలు సమీపంలోని హోటల్ లో బస చేస్తారు. రాత్రి తిరిగి యాత్ర కొనసాగిస్తారు, తెల్లవారు ఝామున యాత్ర ముగిస్తారు. అనంత్ యాత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×