BigTV English

Nagpur News: సీక్రెట్‌గా భర్త వాట్సాప్ మెసేజ్‌లు చూసిన భార్య.. వెంటనే పోలీసులకు కాల్, ఇంతకీ ఆమె ఏం చూసింది?

Nagpur News: సీక్రెట్‌గా భర్త వాట్సాప్ మెసేజ్‌లు చూసిన భార్య.. వెంటనే పోలీసులకు కాల్, ఇంతకీ ఆమె ఏం చూసింది?

Nagpur News: మహిళలను, అమ్మాయిలను ట్రాప్ చేసి లైంగికంగా వేధించి.. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ కిరాతకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన మహారాష్ట్ర, నాగపూర్‌లో చోటుచేసుకుంది. కిరాతకుడిపై అతడే భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై బీఎన్ఎస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.


పోలీసులు వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణానికి చెందిన 33 ఏళ్ల వివాహితుడు చాలా మంది మహిళను లైంగికంగా వేధించాడు. అందులో లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ మహిళ, నిందితుడి భార్య సహాయంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 33 ఏళ్ల వివాహితుడిని అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి 24 ఏళ్ల భార్య ఉంది. గతంలో కూడా నిందితుడి భార్య పోలీసులను ఆశ్రయించింది. తన భర్త లైంగికంగా వేధిస్తున్నాడని.. శారీరకంగా నానా ఇబ్బందులు పెడుతున్నాడని పోలీసులకు కంప్లైంట్ చేసింది.


అయితే కొంత కాలం తర్వాత తన భర్తపై ఆమెకు అనుమానం వచ్చింది. ఆమె భర్త అబ్దుల్ షరీఖ్ ఖురేషి ఇతర మహిళలను కూడా లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె గుర్తించింది. ఖురేషీ నీచపు పనులు తెలుసుకోవడానికి, ఆ మహిళ తన భర్త వాట్సాప్ అకౌంట్ ను హ్యాక్ చేసింది. ఆ తర్వాత తన భర్త ఫోన్ లో ఉన్న మహిళలతో చాటింగ్, అమ్మాయిల పర్సనల్ ఫోటోలు, వీడియోలను గుర్తించింది. తన భర్త ఈ వీడియోలను రహస్యంగా రికార్డ్ చేసేవాడని.. ఆ తరువాత డబ్బు కోసం, తన లైంగిక డిమాండ్లను తీర్చుకోవడానికి మహిళలను విపరీతంగా వేధించాడని.. లేకపోతే పర్సనల్ డేటాను ఆన్‌లైన్‌లో లీక్ చేస్తానని బెదిరించేవాడని ఆమె తెలుసుకుంది.

ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో ఈ విధంగా పేర్కొంది. అబ్దుల్ ఫరీఖ్ ఖురేషీ తనకు పెళ్లి కాలేదని.. పిల్లలు లేరని చెప్పి వేరే అమ్మాయిలతో, మహిళలతో ప్రెండ్ షిప్ చేసేవాడు. బయట, వేర్వేరు ప్రాంతాల్లో తనను కలవాలని ప్రలోభపెట్టేవాడని ఫిర్యాదులో తెలిపింది. అయితే ఖురేషీ భార్య చాలా మంది బాధిత మహిళలను సంప్రదించగా.. వారిలో ఎక్కువ మంది నిందితుడిపై ఫిర్యాదు చేసేందుకు నిరాకరించారని చెప్పింది. అయితే, అందులో లైంగిక వేధింపులకు గురైన 19 ఏళ్ల బాధిత యువతి, తన భార్య మద్దతుతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే, ఫరీఖ్ ఖురేషీ వేరే మతానికి చెందిన వాడు అయినా తనను మాత్రం సాహిల్ శర్మగా పరిచయం చేసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు తనకు వివాహమైందని, ఒక బిడ్డ ఉన్నాడని తనకు చెప్పలేదని.. తనను వివాహం చేసుకుంటానని నమ్మించాడని ఆమె చెప్పింది. ఆమె చదువు కోసం నాగ్‌పూర్‌ కు వచ్చానని తెలిపింది. అబ్దుల్ ఫరీఖ్ తన తల్లి బహుమతిగా ఇచ్చిన రింగ్ ను కూడా రూ. 30వేలకు అమ్మేయమని బలవంతం చేసి, డబ్బును కూడా తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

నిందితుడి మహిళలపై అత్యాచారం, మతం పేరు చెప్పకుండా పేరు అబద్దం చెప్పడం, మహిళలను బ్లాక్‌మెయిల్ చేయడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వంటి నేరాలకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ALSO READ: RCF Ltd Recruitment: టెన్త్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే జీతం అక్షరాల రూ.46,300

ALSO READ: CISF Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పోలీస్ ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే గడువు..

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×