BigTV English

Rishabh Pant: 27 కోట్లు తీసుకున్నాడు కానీ.. 27 పరుగులు కూడా చేయలేదు ?

Rishabh Pant: 27 కోట్లు తీసుకున్నాడు కానీ.. 27 పరుగులు కూడా చేయలేదు ?

Rishabh Pant:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… అందరి దృష్టి ఇప్పుడు లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పైన  ( Lucknow Super Giants captain Rishabh Pant)  పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premier League 2025 Tournament ) హిస్టరీలోనే… అత్యంత భారీ ధర పలికాడు రిషబ్ పంత్. ఏరి కోరి రిషబ్ పంతును ( Rishabh Pant) … లక్నో సూపర్ జెంట్స్ ఓనర్ సంజీవ్.. కొనుగోలు చేశారు. ఏకంగా 27 కోట్లు పెట్టి… రిషబ్ పంతును కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెంట్స్. భారీ కోట్లు పెట్టి ఆ తర్వాత లక్నో కెప్టెన్సీ కూడా అప్పగించింది. దీంతో ప్రస్తుతం జట్టును రిషబ్ పంత్ లీడ్ చేస్తున్నారు.


Also Read: LSG VS PBKS: బౌలింగ్ చేయనున్న పంజాబ్.. పంత్ టీం గెలుస్తుందా…అయ్యర్ ప్లాన్ ఇదే ?

ఇప్పటి వరకు లక్నో సూపర్ జెంట్స్ రెండు మ్యాచ్లు పూర్తి చేసుకోగా… ఇవాళ పంజాబ్ కింగ్స్ జట్టుతో మూడో మ్యాచ్ ఆడుతోంది. అయితే మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన లక్నో సూపర్ జెంట్స్… రెండవ మ్యాచ్ లో మాత్రం అద్భుతంగా ఆడి గెలిచింది. ఇవాళ కూడా కష్టాల్లో పడింది లక్నో సూపర్ జెంట్స్. ఇవాల్టి మ్యాచ్ లో కూడా లక్నో గెలవడం కష్టమేనని తెలుస్తోంది. అయితే 27 కోట్లు తీసుకున్న రిషబ్ పంత్… మూడు మ్యాచ్ ల్లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. మొదట ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పైన.. ఆడిన రిషబ్ పంత్.. డక్ ఔట్ అయ్యాడు. ఆరు బంతులు ఆడిన రిషబ్ పంత్ ఢిల్లీ చేతిలో డకౌట్ కావడం జరిగింది.


ఆ తర్వాత హైదరాబాద్ జట్టుతో.. లక్నో ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో లక్నో గెలిచినప్పటికీ… కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో 15 బంతులు ఆడిన పంత్ 15 పరుగులు చేశాడు. ఇక ఇవాల్టి మ్యాచ్లో పంజాబ్ చేతిలో కూడా పెద్దగా రాణించలేదు పంత్. ఐదు బంతులు ఆడిన రిషబ్ పంత్ రెండు పరుగులు మాత్రమే చేశాడు. దీంతో 27 కోట్లు తీసుకున్న రిషబ్ పంత్ ఇప్పటివరకు 27 పరుగులైన చేయలేదని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజెన్స్. అటు ఇవాళ.. రాత్రి లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కు ఓనర్ సంజీవ్ క్లాస్ పీకుతాడని.. అంటున్నారు.

Also Read: Kohli On World Cup 2027: 2027 వరల్డ్ కప్ లో ఆడటంపై కోహ్లీ సంచలన ప్రకటన..రిటైర్మెంట్ అప్పుడే ?

ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో… గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు రిషబ్ పంత్. అటు లక్నో కెప్టెన్ గా కే ఎల్ రాహుల్ ఆడిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ మొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మెగా వేలం జరిగింది. ఈ తరుణంలోనే రిషబ్ పంత్ 27 కోట్లు పలకగా… Kl రాహుల్ ను … ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×