BigTV English

Supersonic Plane : ‘సూపర్ సానిక్’ పైలట్లు సిద్దం!

Supersonic Plane : ‘సూపర్ సానిక్’ పైలట్లు సిద్దం!

Supersonic Plane : నాసా సూపర్ సానిక్ విమానం ఎక్స్-59 ఇప్పటికే సంచలనాలకు కేంద్ర బిందువైంది. ధ్వని వేగం కంటే 1.4 రెట్లు వేగంతో ఇది దూసుకుపోతుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే న్యూయార్క్ నుంచి లండన్‌కు చేరాలంటే గంటన్నర సమయం చాలు. అదే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 40 నిమిషాల్లోనే చేరుకుంటాం. అదీ ఎక్స్-59 సత్తా.


రానున్న నెలల్లో సూపర్ సానిక్ విమానానికి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తారు. గ్రౌండ్ టెస్టింగ్, ఇంజన్ రన్, టాక్సీ టెస్టులు వీటిలో ఉన్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో తొలి టెస్ట్ ఫ్లయిట్ నిర్వహిస్తామని గత వారం నాసా వెల్లడించింది. అమెరికాలోని జనవాసాల మీదుగా ఈ ట్రయల్స్ నిర్వహిస్తారు.

ఎక్స్-59ను ప్రయోగాత్మకంగా పరీక్షించే తొలి అవకాశం టాప్ పైలట్లు నీల్స్ లార్సన్, జిమ్ క్లూలెస్, డాన్ డాగ్ కేనిన్‌కు దక్కింది. కాలిఫోర్నియా పామ్‌డేల్‌లోని లాక్ హీడ్ కంపెనీలో ఉన్న సూపర్ సానిక్ విమానాన్ని ముగ్గురు పైలట్లు పరిశీలించారు. ఏరోస్పేస్ దిగ్గజ కంపెనీ లాక్ హీడ్ మార్టిన్‌తో కలిసి నాసా ఈ విమానాన్ని క్వెస్ట్(Quiet Supersonic Transport-QueSST) మిషన్‌లో భాగంగా రూపొందించింది.


పెద్దగా చప్పుడు చేయని.. అమిత వేగంతో వెళ్లే విమానాన్ని రూపొందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. సానిక్ బూమ్(పెద్ద శబ్దాలు) కారణంగా.. అవి ప్రయాణించే మార్గంలో భూమ్మీద ఇళ్లు, భవనాల కిటికీల అద్దాలు భళ్లున బద్దలైపోతాయి. ఆ మోతను జనం కూడా భరించలేరు. ఈ కారణంగానే 2003లోనే కాంకర్డ్ సూపర్ సానిక్ విమానాలను నిలిపివేశారు.

ఎక్స్-59‌తో సానిక్ బూమ్‌ సమస్య పెద్దగా ఉండదని నాసా చెబుతోంది. నాసా రూపొందించిన సూపర్ సానిక్ విమానం.. ధ్వని వేగం కంటే 1.4 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే గంటలో 1510 కిలోమీటర్ల దూరాన్ని అవలీలగా అధిగమించేస్తుంది. ఈ విమానం పొడవు 99.7 అడుగులు. వెడల్పు 29.5 అడుగులు.

సానిక్ బూమ్‌ను నిరోధించేలా విమానం డిజైన్‌ను రూపొందించారు. ముక్కు చాలా పొడవుగా 38 అడుగులు ఉంటుంది. ఈ కారణంగా కాక్‌పిట్ విమానం మధ్య భాగంలోకి వస్తుంది. ఇక్ ఇంజన్‌ను పైభాగంగా అమర్చారు. సాధారణ విమానాలు ధ్వని వేగంలో 80 శాతం వేగంతో 30 వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తాయి.

ఎక్స్-59 మాత్రం 55వేల అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. ఇతర విమానాలతో పోలిస్తే 75 శాతం తక్కువ శబ్దం చేస్తుంది. ఎక్స్-59 సూపర్ సానిక్ విమానం ఖరీదు రూ.1755 కోట్ల వరకు ఉంటుంది. మరిందరు ప్రయాణికులకు వీలు కల్పించేలా డిజైన్‌ను మార్చే ప్రణాళికలను నాసా పరిశీలిస్తోంది. 20 సూపర్ సానిక్ విమానాల కొనుగోలుకు లాక్ హీడ్ సంస్థతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ 2022లోనే ఒప్పందం చేసుకుంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×