BigTV English

AP – Karnataka Focus on Tesla: టెస్లా మాటేంటి..? తాను స్వార్థపరుడ్నికాదన్న మంత్రి కుమారస్వామి!

AP – Karnataka Focus on Tesla: టెస్లా మాటేంటి..? తాను స్వార్థపరుడ్నికాదన్న మంత్రి కుమారస్వామి!

Andhra Pradesh and Karnataka Focus on Tesla: గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇండియాలో ఎక్కడ అడుగు పెడుతోంది..? ఈ విషయంలో టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఆలోచన ఎలా ఉంది? ఒకవేళ వస్తే ఏ రాష్ట్రానికి వెళ్తోంది..? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆ కంపెనీ ప్రయత్నం చేస్తోంది. పెట్టుబడుల్లో భాగంగా గతేడాది ఏప్రిల్‌లో ఇండియాకు ఆయన రావాల్సి వుంది. కాకపోతే అనివార్య కారణాల వల్ల మస్క్ టూర్ కాస్త డిలే అవుతూ వస్తోంది. ఈవీ వాహనాల పాలసీలను ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది.


సీన్ కట్ చేస్తే… మోదీ 3.0 కేబినెట్‌ కొలువుదీరింది. కర్ణాటక మాజీ మంత్రి కుమారస్వామికి స్టీల్, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో మీడియా మిత్రులు పలు ప్రశ్నలు లేవ నెత్తారు. గ్లోబల్ కార్ల కంపెనీ టెస్లా కంపెనీని కర్ణాటక‌కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారా? అని ప్రశ్న వేశారు. దీనికి తనదైన శైలిలో రిప్లై ఇచ్చేశారు కేంద్రమంత్రి కుమారస్వామి.

తాను అంత స్వార్థపరుడ్ని కాదన్నారు. తన దృష్టి సొంత రాష్ట్రంపై లేదని, భారతదేశం అంతటా ఉందన్నారు. టెస్లా కంపెనీని కర్ణాటకకు తీసుకురావడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తానన్నారు. తన ప్రాధాన్యత కేవలం కర్ణాటకకు పరిమితం కాలేదని, దేశానికి సంబంధించిన అభివృద్ధిగా చెప్పుకొచ్చారు. దాని ప్రకారమే పని చేస్తానన్నారు.


Also Read: వీఐపీల భద్రతలో మార్పులు, ఎన్ఎస్‌జీని తప్పించి.. ఆ స్థానంలో

టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచన చేస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. కియా తరహాలో టెస్లాను ఇక్కడకు తీసుకొస్తే ఏపీ అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఇందుకోసం మంత్రి నారా లోకేష్‌ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్లాను తీసుకొచ్చే బాధ్యతను సీఎం చంద్రబాబు, లోకేష్‌కు అప్పగిస్తారని అంటున్నారు.

కేంద్రం నుంచి రాయితీలు లభించడమే కాదు ఎగుమతులు ఏపీ అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు అంచనా వేస్తున్నారు. రాబోయే రెండు నెలల్లో ఫారెన్‌ టూర్‌కు మంత్రి నారా లోకేష్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌తో మాట్లాడే అవకాశముందని ప్రభుత్వ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నమాట.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×