Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లను తరలిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు పడిన ప్రాంతం చాలా లోతుగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్స్ కాస్త ఆలస్యమవుతున్నాయి. తీవ్ర గాయాల కారణంగా ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన బసంత్‌గఢ్ ప్రాంతానికి రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి.
సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్న కేంద్రమంత్రి
ఈ ప్రమాదంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఈ వార్త తనకు బాధ కలిగించిందని.. ఆ వాహనంలో ధైర్యవంతులైన జవాన్లు ఉన్నారన్నారు. సహాయక కార్యక్రమాలపై స్థానిక అధికారులతో మాట్లాడినట్టు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు స్వచ్చంధంగా వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు ఆయన.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే, స్థానిక పోలీసులు, అంబులెన్స్ బృందాలు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన జవాన్లను తక్షణ వైద్య సహాయం కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న కొందరు జవాన్లను హాస్పిటల్‌కి ప్రత్యేక చికిత్స కోసం తరలించినట్లు తెలిపారు.
Also Read: రూ.20 కోట్లు.. 80 మంది పిల్లలు.. నమ్రత కేసులో సంచలనాలు
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద కారణాలను తెలుసుకుంటామని కూడా తెలిపారు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు ఎదుర్కొంటున్న సవాళ్లను మరోసారి గుర్తు చేస్తుంది
జమ్మూ ఉదంపూర్ లో లోయలో పడిన ఆర్మీ వాహనం
ప్రమాదంలో ఇద్దరు CRPF జవాన్లు మృతి, 12 మందికి గాయాలు
ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయకచర్యలు #JammuAndKashmir #udhampur #Kashmir pic.twitter.com/KcIzUIoRKk
— BIG TV Breaking News (@bigtvtelugu) August 7, 2025