Karachi Airport Viral Video: అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ పరువు రోజు రోజుకు మరింత దిగజారుతోంది. తాజాగా కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా మరోసారి పరువు పతాక స్థాయిలో పోగొట్టుకుంది. ఎయిర్ పోర్టులోని ఓ కేఫ్ లో కండోమ్ బాక్సులను పేపర్ ప్లేట్లుగా ఉపయోగించడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే?
తాజాగా ఓ ప్రయాణీకుడు కరాచీ విమానాశ్రయంలోని కేఫ్ కు వెళ్లాడు. అక్కడ శాండ్ విచ్ ఆర్డర్ చేశాడు. కాసేటి తర్వాత సదరు ప్రయాణీకుడికి కేఫ్ సిబ్బంది ఓ పేపర్ ప్లేట్ లో శాండ్ విచ్ అందించారు. దానిని తీసుకుని తింటుండగా, ఆ ప్లేట్ మీద రాసిన వివరాలు చూసి షాకయ్యాడు. వెంటనే, కేఫ్ సిబ్బందిని పిలిచి ఈ ప్లేట్స్ సంగతి గురించి చెప్తాడు. ఈ ప్లేట్లు రీసైకిల్ చేసిన కండోమ్ బాక్సులతో తయారు చేశారని వివరిస్తాయి. ఈ విషయం మీకు తెలుసా? అని ప్రశ్నిస్తాడు. తమకు తెలియదని కేఫ్ లోని యువకుడు చెప్పడంతో “నేను పాకిస్తాన్ పరిస్థితిని చూసి ఏడుస్తున్నాను” అని కామెంట్ చేస్తాడు. ఈ తతంగాన్ని అంతటినీ తన ఫోన్ లో షూట్ చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Karachi airport paper plate is made of spare male c*ndom boxes❓
A Pakistani passenger has put out a video from Pakistan's Karachi airport where food was being served on paper plates which were to be used in c*ndom boxes.
The passenger expresses shock and says "I feel crying… pic.twitter.com/u9g9s8tKv6
— Resonant News🌍 (@Resonant_News) August 6, 2025
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పాకిస్తాన్ మరీ ఇంత దిగజారిందా? అని కామెంట్స్ పెడుతున్నారు. కరాచీ విమానాశ్రయంలో ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన విమనాశ్రయంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. అటు ఈ ఘటనపై ఇప్పటి వరకు విమానాశ్రయ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. నెటిజన్లు మాత్రం కేఫ్ సిబ్బందితో పాటు కరాచీ విమానాశ్రయ అధికారులపై నిప్పులు చెరుగుతున్నారు. ఎయిర్ పోర్టులో ప్రయాణీకులకు ఎలాంటి ఫుడ్ అందిస్తున్నారో? ఎందులో అందిస్తున్నారో? తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నారా? అంటూ మండిపడుతున్నారు. “పాకిస్తాన్ లో అంతే” అంటూ సింపుల్ గా ఆ దేశ పరువును తీసేస్తున్నారు.
వాష్ రూమ్ లో నీళ్లు లేవంటూ నటి ఆగ్రహం
కొద్ది కాలం క్రితం పాకిస్థానీ నటి హీనా బాయత్ కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ పోర్టు వాష్ రూమ్ లలో కనీసం నీళ్లు కూడా అందుబాటులో లేవని మండిపడింది.“ఈ రోజు కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నాను. ఇక్కడ ఏ ఒక్క వాష్ రూమ్ లోనూ నీళ్లు లేకపోవడం నేను చూస్తున్నాను. ప్రజలు వారి పిల్లలను వాష్ రూమ్ కు తీసుకెళ్లాలన్నా నీళ్లు లేవు” అని మండిపడింది. కరాచీ విమానాశ్రయం వంటి ముఖ్యమైన ప్రదేశాల్లోని వాష్ రూమ్ లలో నీళ్లు లేకపోతే, ఎక్కడ ఉంటాయని ప్రశ్నించింది. విమానాశ్రయాల్లోని వాష్ రూమ్ లలో నీటి కొరత లాంటి ప్రాథమిక సమస్యలను విస్మరించి, కొత్త రైళ్లు, భారీ ప్రాజెక్టుల నిర్మాణంపై దేశాలు ఎలా దృష్టి సారిస్తాయని హీనా బాయత్ ప్రశ్నించింది.
Read Also: బచ్చా బాజీ.. పాక్ లొ పాపిష్టి ఆచారం.. అబ్బాయిలకు అమ్మాయిల వేషం వేసి అలా చేస్తారట!