Ramdev Baba: యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ బాబా చిక్కుల్లో పడ్డారు. రామ్ దేవ్ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి సంస్థకు చెందిన దివ్య ఫార్మసీ ఉత్పత్తులపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు ప్రచారాలు జరగడంతో కేరళ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ వారిపై కేసు నమోదు చేశారు. ఇదే కేసుపై పాలక్కాడ్ జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. అయితే ఫిబ్రవరి 1న విచారణకు రావాలని కోర్టు ఆదేశించినా రాకపోవడంతో ఇద్దరిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది న్యాయస్థానం. ఈనెల 15న మరోసారి విచారణ చేపట్టనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, అబద్దాలను ప్రచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా కేరళ డ్రగ్ ఇన్ స్పెక్టర్ వారిద్దరిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. ఈ కేసు విచారణలో భాగంగా పాలక్కాడ్ కోర్టు బాబా రాందేవ్ కు, ఆచార్య బాలకృష్ణకు గతంలో నోటీసులు పంపించింది. కాగా, పతంజలి అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీకి చెందిన పది ఉత్పత్తులపై ప్రభుత్వం గతంలోనే వేటు వేసింది.
ఆ ఉత్పత్తులకు సంబంధించి ప్రసార మాధ్యమాల్లో విడుదల చేసిన ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంటూ వాటి తయారీ లైసెన్స్ ను సైతం కోర్టు రద్దు చేసింది. ఉత్పత్తులకు సంబంధించి తయారీ లైసెన్స్‌ను కూడా రద్దు చేసింది. కాగా, దీనిపై పతంజలి సంస్థ సీఈవో, రాందేవ్ బాబా ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరీ. రాందేవ్ బాబా నియమితంగా హాజరు కాకపోవడంతో, పాలక్కాడ్ కోర్టు జనవరి 16న వీరిపై బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలసిందే.
Also Read: Junior Executive Jobs: ఎయిర్ట్‌పోర్టులో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,00,000 పూర్తి వివరాలివే..
ఈ కేసు నేపథ్యంలో.. పతంజలి అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీకి చెందిన పది ఆయుర్వేద ఉత్పత్తులపై కేంద్రం ఇప్పటికే నిషేదం విధిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. అవి ఆ సమయంలో తప్పుడు ప్రకటనల ద్వారా ప్రజలను మోసగిస్తున్నాయని ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు, సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పతంజలి సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.
కాగా, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన దివ్య ఫార్మసీ కేళర యాడ్స్ రూల్స్ బ్రేక్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేశారు. దీనిపై ఫిబ్రవరి 01న కోర్టు ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా బాబా రామ్‌దేవ్, బాలకృష్ణలను న్యాయస్థానం ఆదేశించింది. వీరు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి ఇద్దరిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 15న జరగనుంది. దివ్య ఫార్మాసిటీని మొదటి నిందితుడిగా, ఆచార్య బాలకృష్ణ రెండో నిందితుడిగా, బాబా రామ్‌దేవ్‌ను మూడో నిందితుడిగా పేర్కొన్నారు.
గతంలో కూడా అల్లోపతి వంటి ఆధునిక ఔషధాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రచారం చేసినందుకుగానూ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అటువంటి ప్రకటనలు మానుకోవాలని హెచ్చరించింది. అవేమి పట్టించుకోని పతంజలి సంస్థ.. తిరిగి ప్రకటనలు ప్రచురించడంతో కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. ఈ వ్యవహారం సీరియస్ కావడంతో రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలు బహిరంగ క్షమాపణలు చెప్పారు.