U19 Women’s T20 World Cup: ఐసీసీ మహిళల అండర్-19 టీ-20 ప్రపంచ కప్ ఫైనల్ లో భాగంగా ఫిబ్రవరి 2 ఆదివారం రోజున భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడింది. ఈ టోర్నీ ప్రారంభం నుండి సంచలన విజయాలతో దూసుకొచ్చిన టీమిండియా.. ఫైనల్ లో కూడా అదే జోరుని చూపించింది. దీంతో రెండవసారి ఈ టైటిల్ ని చేజిక్కించుకుంది. దక్షిణాఫ్రికా – భారత్ జట్ల ఫైనల్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
Also Read: Rajeev Shukla – Dhoni: రాజకీయాల్లోకి ధోని.. BCCI సంచలన ప్రకటన !
దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా మహిళా జట్టుపై భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా నిర్ణిత 20 ఓవర్లలో కేవలం 82 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మైకే వాన్ వూర్ట్స్ (23), జెమ్మా బోథా (16), ఫే కౌలింగ్ (15), వికెట్ కీపర్ కారాబో మెసో (10) పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.
సిమోన్ లారెన్స్ (0), డయారా రామ్లాకన్ (3), కెప్టెన్ కైలా రేనేకే (7), షెష్ని నాయుడు (0), అష్లి వాన్ వైక్ (0), మోనాలిసా లెగోడీ (0), న్తాబి సెంగ్ నిని (2) పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో 20 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా 82 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. భారత స్టార్ ఆల్ రౌండర్, తెలుగు అమ్మాయి గొంగడి త్రిష తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించింది.
తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్లను పడగొట్టింది. ఇక వైష్ణవి శర్మ,, ఆయుషి శుక్ల, పరిణికా సిసోడియ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షబ్నమ్ ఒక వికెట్ పడగొట్టింది. అనంతరం అనంతరం 83 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు నాలుగవ ఓవర్ మూడవ బంతి వద్ద వికెట్ కీపర్ జి.కమలిని (8) వికెట్ ని కోల్పోయింది.
Also Read: Pandya- Natasha: పాండ్యా పొలంలో మొలకలు వచ్చాయి.. నటాషాతో కలిసి ఫోటోలు !
ఇక తెలుగు అమ్మాయి గొంగడి త్రిష, సనికా చాల్కే సునాయాసంగా భారత జట్టును విజయతీరాలకు చేర్చారు. గొంగడి త్రిష 33 బంతుల్లో 44 పరుగులు, సనికా చాల్కే 22 బంతుల్లో 26 పరుగులు చేసి ఆడుతూ పాడుతూ భారత జట్టుని విజయతీరాలకు చేర్చారు. దీంతో రెండవసారి భారత జట్టు ఇండియా ఉమెన్స్ అండర్ 19 టి-20 వరల్డ్ కప్ {U19 Women’s T20 World Cup} ని సొంతం చేసుకుంది. కేవలం 11.2 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ కోల్పోయి మరో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది.
ఈ టోర్నీ మొత్తంలో 7 మ్యాచ్ లు ఆడిన గొంగడి త్రిష.. 67.205 సగటుతో 309 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత జట్టు మరోసారి కప్ సాధించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగమ్మాయి గొంగడి త్రిషపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ICC POSTER FOR WOMEN'S U19 T20 WORLD CUP CHAMPIONS – INDIA. 🇮🇳 pic.twitter.com/QKAkpoWbie
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 2, 2025