BigTV English

Amma Rajasekhar: అవకాశమిచ్చి పిలిచినా రావట్లేదు, అందుకే అలా చేశాను.. అవినాష్‌పై అమ్మ రాజశేఖర్ కామెంట్స్

Amma Rajasekhar: అవకాశమిచ్చి పిలిచినా రావట్లేదు, అందుకే అలా చేశాను.. అవినాష్‌పై అమ్మ రాజశేఖర్ కామెంట్స్
Advertisement

Amma Rajasekhar: ‘జబర్దస్త్’ అనే ఒక కామెడీ షో ఇండస్ట్రీలో గుర్తింపు రాని ఎంతోమంది ఆర్టిస్టులకు కామెడియన్స్‌గా గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతే కాకుండా వారందరికీ విపరీతమైన పాపులారిటీ దక్కేలా చేసింది. అలా జబర్దస్త్‌లో పాపులర్ అయిన చాలామంది నటీనటులకు బిగ్ బాస్ అనే రియాలిటీ షో నుండి పిలుపు కూడా వచ్చింది. బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్‌గా కనిపించిన తర్వాత బుల్లితెరపై వారి పాపులారిటీ మరింత పెరిగింది. అలా బిగ్ బాస్‌కు సంబంధించిన ఒకే సీజన్‌లో అమ్మ రాజశేఖర్, అవినాష్ కంటెస్టెంట్స్‌గా కనిపించారు. ప్రస్తుతం ఒక సినిమాను డైరెక్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు అమ్మ రాజశేఖర్. తాజాగా ఆయన పాల్గొన్న ఇంటర్వ్యూలో అవినాష్ క్యారెక్టర్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఫోన్ చేసి తిట్టాను

బిగ్ బాస్ పూర్తయిన తర్వాత అవినాష్ (Avinash).. జబర్దస్త్‌కు కూడా పూర్తిగా దూరమయ్యాడు. ఇతర ఛానెల్‌లో షోలకే పరిమితయ్యాడు. అమ్మ రాజశేఖర్ మాత్రం మరోసారి దర్శకుడిగా మారి సినిమాలు తెరకెక్కించడం మొదలుపెట్టాడు. ఆయన సినిమాలో అవినాష్‌కు అవకాశమిచ్చిన విషయాన్ని తాజాగా బయటపెట్టాడు అమ్మ రాజశేఖర్. ‘‘నిన్ననే అవినాష్‌కు ఫోన్ చేసి తిట్టాను. బిగ్ బాస్‌లో నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. సపోర్ట్‌గా ఉన్నాడు. అప్పుడే నేను తనకు మంచి అవకాశమిస్తానని మాటిచ్చాను. చెప్పినట్టుగానే ఇప్పుడు నేను చేస్తున్న మూవీలో మెయిన్ కామెడియన్ రోల్ ఇచ్చాను. కామెడియన్ అయినా మంచి సాంగ్ కూడా ఇచ్చాను’’ అని చెప్పుకొచ్చాడు అమ్మ రాజశేఖర్.


చిన్న షోలకే పరిమితం

‘‘అవినాష్‌కు నేను మంచి రోల్ ఇచ్చినా ఒక్కరోజు కూడా షూటింగ్‌కు రాలేదు. చిన్న చిన్న షోలకు వెళ్తున్నాడు. నేను ఎంత పిలిచినా వస్తున్నా వస్తున్నా అని రావట్లేదు. ఈ సినిమాలో టీ రాజేందర్ పాట పాడుతున్నారు. నాకోసం అక్కడి నుండి వచ్చారు. నా కోసం ఆయన ఫ్లైట్‌లో స్వయంగా వచ్చి పాడేసి వెళ్లారు. అలా ఉన్నారు మనుషులు. కానీ ఇక్కడ మాత్రం అవినాష్ లాంటి వాళ్లు ఉన్నారు. షూటింగ్ కోసం టూర్‌కు వెళ్తున్నామని చెప్తున్నా కూడా వేరే సినిమాలు ఒప్పుకున్నా అంటున్నాడు. అప్పుడు నా సినిమాలో ఉన్న పవర్ గురించి వాడికి ఎలా చెప్పగలను?’’ అంటూ అవినాష్ చేసిన అన్యాయం గురించి చెప్తూ వాపోయాడు అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar).

Also Read: సమంత వల్లే అదంతా.. నాగ్ ఉండుంటే ఆ పరిస్థితి వేరు.. దివి కామెంట్స్..!

తను మాత్రం రావట్లేదు

‘‘నా సినిమాలో సత్యం రాజేశ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. కానీ అవినాష్ పాత్రకు ఉన్నంత రేంజ్ లేదు. ఆయన కూడా అన్నింటికి వస్తున్నాడు. అవినాష్ మాత్రం ఇలా చేస్తున్నాడు’’ అని చెప్పుకొచాడు అమ్మ రాజశేఖర్. బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అవినాష్ చాలా మారిపోయాడని చాలామంది జబర్దస్త్ ప్రేక్షకులు సైతం ఫీల్ అయ్యారు. అవినాష్.. ఒకసారి కాదు.. రెండుసార్లు బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా కనిపించాడు. ఇటీవల పూర్తయిన బిగ్ బాస్ సీజన్ 8లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి అందరినీ అలరించాడు. లక్కీగా టాప్ 5 స్థానాన్ని కూడా దక్కించుకున్నాడు.

Related News

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Big Stories

×