Aruna Miller : విదేశాల్లో ముఖ్యంగా బ్రిటెన్, అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతోంది. మొన్న కమలా హ్యారిస్, నిన్న రిషి సునక్, ఈరోజు అరుణా మిల్లర్ చరిత్ర సృష్టించారు. అమెరికాలోని మేరీల్యాండ్‌కు భారత సంతతికి చెందిన అరుణ మిల్లర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఎంపికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి ఆసియా అమెరికన్‌గా ఆమె చరిత్ర సృష్టించింది.
అరుణ మిల్లర్ తెలంగాణలో జన్మించింది. తనకు ఏడేళ్ల వయసున్నట్లు తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. అప్పటి నుంచే అరుణ ఫ్యామిలీ అక్కడే సెటిల్ అయింది. మిస్సౌరీ యూనివర్సిటీ నుంచి బీఎస్ డిగ్రీ పూర్తిచేశారు. 90వ దశకంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి అనేక సార్లు శాసనసభ పదలవులను చేపట్టారు. మేరీల్యాండ్‌లో ప్రజల ఆదరణతో పాటు ప్రత్యక్ష పార్టీల నాయకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవళ జరిగిన ఎన్నికల్లో అరుణ మిల్లర్ తరపున అమెరికా అధ్యక్షుడు జైబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రచారం చేశారు. అరుణ మిల్లర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఎన్నికకావడంతో ప్రవాస భారతీయుల్లో ఆనందోత్సాహం నెలకొంది.