E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Ayodhya Ram Mandir: అయోధ్య విరాళాల కేసు.. దిమ్మ తిరిగే వాస్తవాలు, బయటకు వస్తున్న తిమింగలాలు

Ayodhya Ram Mandir: అయోధ్య విరాళాల కేసు.. దిమ్మ తిరిగే వాస్తవాలు, బయటకు వస్తున్న తిమింగలాలు
Advertisement

Ayodhya Ram Mandir: అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల చోరీ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోందా? ఈ యవ్వారంలో తీగ లాగితే డొంక అంతా కదులు తోందా? సిబ్బందికి కొందరు బ్యాంకు ఉద్యోగులు తోడయ్యారా? దేవుడి విరాళాల విషయంలో ట్రస్టు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందా? ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని అందులోని సిబ్బంది దేవుడు సొమ్ము కొట్టేసే ప్రయత్నం చేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

అయోధ్య విరాళాల కేసు.. దిమ్మ తిరిగే వాస్తవాలు

Advertisement

అయోధ్యలోని శ్రీరామ విరాళాల చోరీ కేసులో భయకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సిట్ అధికారులు తీగలాగితే డొంక కదులుతోంది. ట్రస్టులో లోపాలు బట్టబయలవుతున్నాయి. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు అయ్యారు. అందులో ఒకే కుటుంబానికి చెందినవారు ఇద్దరున్నారు. నిందితుల సొంత ఊళ్లకు వెళ్లి దర్యాప్తు చేసిన అధికారులకు షాకయ్యే విషయాలు బయటపడ్డాయి.

దాతల విరాళాలు, విలువైన వస్తువులు లెక్కించేందుకు ఆలయంలో పని చేస్తున్న అనుకల్ప్‌, అధికారులను ఒప్పించి తన బావ లవ్‌కుశ్‌ మిశ్రాను పనికి పెట్టాడు. తాను చేయబోయే టీమ్‌లో సభ్యుడిగా చేసుకున్నాడు. విరాళాల చోరీకి కర్మ, కర్త, క్రియ సూత్రధారి అనుకల్ప్‌ మిశ్రానేనని చెబుతున్నారు సిట్‌ అధికారులు. అనుకల్ప్‌ సొంతూరికి వెళ్లి అక్కడి గ్రామస్థులను సిట్ అధికారులు ప్రశ్నించారు.

Advertisement

సాదాసీదాగా ఉన్న మిశ్రా ఫ్యామిలీ ఒక్కసారిగా మారిపోయిందని, ఇల్లు, స్కార్పియో వాహనం కొనుగోలు చేసినట్లు తేలింది. అనుకల్ప్‌ తన లైఫ్ స్టయిల్‌ని మార్చుకున్నాడని, తన ఊరుకి దగ్గర్లో ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు సమాచారం. బ్యాంక్‌ ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేశాడు అనుకల్ప్‌ మిశ్రా. మూడేళ్ల కిందట విరాళాలను లెక్కించే టీమ్‌లో ఉద్యోగిగా చేరాడు. బావ లవ్‌కుశ్‌ మిశ్రాను తెచ్చుకున్నాడు.

8 మంది అరెస్ట్.. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్

బావబావమరిది కలిసి అయోధ్య నిధులపై కన్నేసినట్టు తెలుస్తోంది. అరెస్టయిన 8 మంది నిందితుల ఆర్థిక, వారి ఆస్తుల గురించి దర్యాప్తు చేస్తోంది. ఇదిలావుండగా శ్రీ రామ్ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన బ్యాంకు ఖాతా ఎస్‌బిఐలో ఉంది. ఆలయంలో భక్తుల నుండి సేకరించిన నగదును లెక్కించిన తర్వాత అందులో జమ చేస్తారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు బ్రాంచ్ మేనేజర్‌ను ప్రశ్నించారు. అతడి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

మూడు నెలల కిందట లెక్కింపు సిబ్బందిని తొలగించాలని ఎస్‌బిఐ శాఖ సిఫార్సు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆలయ ట్రస్టుకు చెందిన కొందరు అధికారులు జోక్యం చేసుకుని వారి తొలగింపును అడ్డుకున్నారని ఆరోపించాయి. విరాళాలను స్వీకరించిన సమయంలో బ్యాంకు అధికారులు నిర్దేశించిన విధానాలు పాటించారా? లేదా? లోపాల కారణంగా నిధుల మళ్లింపుకు దోహదపడిందా? అనే విషయాలపై కూడా పరిశీలిస్తున్నారు.

దర్యాప్తులో ఇద్దరు ఎస్‌బిఐ ఉద్యోగులు రత్నేష్, గగన్‌దీప్ పాత్ర వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ట్రస్టు వర్గాల సమాచారం ప్రకారం.. నగదు నిర్వహణ ప్రక్రియలో నిమగ్నమైన ఆరుగురు అవుట్‌సోర్స్ కార్మికులను ఇద్దరు అధికారులు పర్యవేక్షించేవారు. వారి సాధారణ బ్యాంకు ఉద్యోగులే. భక్తుల నుండి సేకరించిన విరాళాలను లెక్కించి, ఆ నగదును డిపాజిట్ కోసం ఎస్‌బిఐ శాఖకు సురక్షితంగా తరలించే బాధ్యత అవుట్‌సోర్స్ సిబ్బందే.

ALSO READ: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బుధవారం నుంచి కొత్త రూల్స్, ధరల మాటేంటి?

రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత దానికి సంబంధించిన అత్యంత సున్నితమైన ఆర్థిక అవకతవకల కేసు. సిట్ ప్రాథమిక నివేదికను సమర్పించిన తర్వాత ఈ కేసు దర్యాప్తు ఊపందుకుంది. 8 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు పోలీసులు. రాయ్, మిశ్రాలు ట్రస్ట్‌కు రాజీనామా చేశారు.

అయోధ్యలోని శ్రీ రామ మందిరానికి వచ్చిన విరాళాల నుంచి కోట్లాది రూపాయలు గల్లంతయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ-ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఆ తర్వాత ఈనెల 7న దీనిపై గందరగోళం చెలరేగింది. కేసు తీవ్రత దృష్ట్యా విరాళాల నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేసేందుకు జూన్ 13న యోగీ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.

Related News

Gas Cylinder Customers Alert: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బుధవారం నుంచి కొత్త రూల్స్, ధరల మాటేంటి?

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. దద్దరిల్లిన ఢిల్లీ, జమ్ముకశ్మీర్..!

పెళ్లి వద్దని చెప్పడం కంటే.. హత్య చేయడమే తేలిక.. విచారణలో సియా గోయల్ వెల్లడి

కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్.. కాబోయే భార్య కావాలని చంపలేదా? ప్రియుడే బెదిరించాడా?

Modi Cabinet: రెండు రోజుల్లో మోదీ కేబినెట్‌లో భారీ మార్పులు, పలువురికి పదవీ గండం, కొత్తగా వచ్చేదెవరు?

LPG Gas: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఆంక్షలు ఎత్తేసిన కేంద్రం, మరి ధరలు తగ్గుతాయా?

Delhi: పాస్‌పోర్టు -పౌరసత్వ వ్యవహారం.. కేంద్రంపై ఓవైసీ విమర్శలు, బీజేపీ కార్డు నిరూపిస్తుందా?

Big Stories

×