Delhi: హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థులపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటనపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నోరు విప్పారు. నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉంటుందన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించారు. తనకు-విద్యార్థులకు మధ్య సమస్య అని, అందులో బీసీఐ జోక్యం ఎందుకని అసహనం వ్యక్తంచేశారు.
హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను పిలవద్దని లా విద్యార్థులు లేఖ రాశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. తాము ఉత్తర్వులు జారీ చేసేంత వరకు నల్సార్ యూనివర్సిటీ-2026 బ్యాచ్ విద్యార్థులను న్యాయవాదులుగా నమోదు చేసుకోవద్దని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా-బీసీఐ ఛైర్మన్ మనన్‌కుమార్ మిశ్రా దేశవ్యాప్తంగా బార్ కౌన్సిళ్లకు లేఖ రాశారు.
ఆయన చేసిన ప్రకటనపై విమర్శలు తీవ్రమయ్యాయి. రాజ్యాంగబద్ధమైన సంస్థతో విభేదించిన ఒక్క కారణంతో న్యాయవాద వృత్తిలో ప్రవేశించే హక్కును నిరాకరిస్తామని విద్యార్థులను బెదిరించకూడదని వ్యాఖ్యానించారు పలువురు సీనియర్ నిపుణులు. ఈ విషయంలో బీసీఐ తొందరపాటుతో వ్యవహరించిందని, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. దీనిపై శుక్రవారం సీజేఐ జస్టి సూర్యకాంత్ మాట్లాడారు. ఇదంతా అనవసరమైన ప్రక్రియగా తెలిపారు.
విద్యార్థిగా ఉన్నప్పుడు తాను నిరసనల్లో చురుగ్గా పాల్గొనేవాడిని, ఈ విషయం తనకు-విద్యార్థులకు మధ్య జరిగిన విషయమన్నారు. జోక్యం చేసుకోవడానికి వాళ్లెవరు? అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీఐ ఇచ్చిన సర్క్యులర్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. నల్సార్ విద్యార్థులు-అధ్యాపకులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచన చేసింది. సీజేఐ ఆదేశాలతో ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పడింది. దీనిపై నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
ALSO READ: వాహనదారులకు బిగ్ షాక్.. ఇంటి ముందు పార్కింగ్ చేస్తే రూ.25 వేలు, కొత్త రూల్స్ ఎక్కడో తెలుసా?