Census-2027: జనాభా గణన విషయంలో కీలక అడుగు వేసింది కేంద్రం. జనాభా లెక్కల రెండో విడత కోసం 40 ప్రశ్నల జాబితాను విడుదల చేసింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా కులానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో ఈసారి జనాభా గణన అనేక విధాలుగా చారిత్రాత్మకం కాబోతోంది. అంతేకాకుండా ఈ ప్రక్రియ దేశంలో అతిపెద్ద డిజిటల్ జనాభా గణన కానుంది.
ఈసారి జనాభా గణన పూర్తిగా డిజిటల్ రూపంలో జరగనుంది. దీనిద్వారా దేశ జనాభా వివరాలకు సంబంధించి ఆధునిక డేటాబేస్ రెడీ కానుంది. లడఖ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో జనాభా గణన సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 30 మధ్య జరుగుతుంది. ఇంటింటికీ వెళ్లి లెక్కించే ప్రక్రియకు ముందు ఆగస్టు 17-31 వరకు నివాసితులు ఆన్‌లైన్‌లో స్వయంగా ఫారంను పూరించే అవకాశం ఉంటుంది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో జనాభా గణన వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం.. మొత్తం 40 రకాల సమాచారాన్ని సేకరించనున్నారు. అందులో కులం, వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకున్నారు? బ్యాంక్ అకౌంట్లు ఎన్ని? వంటి సమాచారం ఇవ్వాల్సివుంటుంది.
పేరు ఏమిటి?
కుటుంబ పెద్దతో మీకు ఎలాంటి సంబంధం ఉంది?
మీ లింగం ఏమిటి? (పురుషుడు/స్త్రీ/ఇతర)
పుట్టిన తేదీ- పూర్తి సంవత్సరాలు, ప్రస్తుతం మీ వయస్సు ఎంత?
ప్రస్తుత వైవాహిక స్థితి ఏమిటి?
వివాహం జరిగినప్పుడు వయస్సు ఎంత?
జీవిత భాగస్వామి పేరు ఏమిటి?
మీరు ప్రకటించుకున్న జాతీయత ఏమిటి?
మతం ఏమిటి?
మీరు షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగ (ST) లేదా మరేదైనా కులానికి చెందినవారు?
నాన్న పేరు, వివరాలు ఏమిటి?
అమ్మ పేరు, వివరాలు రాయాలి.
మీరు ఏదైనా వైకల్యంతో బాధపడుతున్నారా?
మీ మాతృభాష ఏమిటి? మీకు తెలిసిన ఇతర భాషలెన్ని?
మీ అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత (కంప్యూటర్/మొబైల్ వాడకం ఉందా?
ప్రస్తుతం ఏదైనా విద్యా సంస్థలో చదువుతున్నారా?
అత్యున్నత విద్యా అర్హత ఏమిటి, ప్రధానంగా సబ్జెక్ట్/స్ట్రీమ్ ఏమిటి?
ఏడాది కాలంలో ఎప్పుడైనా ఆర్థిక సంబంధిత పనులు చేశారా?
ఆర్థిక కార్యకలాపాలు ఏ వర్గం కిందకు వస్తుంది?
ప్రధాన వృత్తి లేదా ఉద్యోగం ఏమిటి?
పని/వ్యాపారం యొక్క స్వభావం ఏమిటి? పరిశ్రమ-వాణిజ్యం లేకుంటే ఏ సర్వీసులో పని చేస్తున్నారు? లేదా సేవ?
పని ఆధారంగా మీ తరగతి/వర్గం ఏమిటి? (ఉదా. యజమాని, ఉద్యోగి, స్వయం ఉపాధి పొందుతున్నవారు)
ఉద్యోగం లేదా వ్యాపారం లేకపోతే రోజంతా ప్రధానంగా ఏమి చేస్తారు?
ఉద్యోగం చేయకపోతే అందుకోసం ఎదురు చూస్తున్నారా? ఉద్యోగం చేయడానికి అందుబాటులో ఉన్నారా?
మీ కార్యాలయానికి ఎలా ప్రయాణిస్తారు? ఎంత దూరం ప్రయాణిస్తారు?
మీ జన్మస్థలం ఎక్కడ?
ఈ ప్రదేశానికి ముందు మీరు నివసించిన చివరి ప్రదేశం ఏది?
నివాసం మార్చడానికి వలస ప్రధాన కారణమా?
చివరిసారి నివాసం మార్చిన నుండి ఈ గ్రామంలో/నగరంలో ఎంతకాలం ఉన్నారు?
మీ శాశ్వత నివాస చిరునామా ఏమిటి?
ప్రస్తుతం పిల్లలు ఎంతమంది? (వివాహిత, వితంతువు లేదా విడాకులు తీసుకున్న మహిళలకు మాత్రమే)
పుట్టిన వెంటనే బతికి బయటపడిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? (వివాహిత, వితంతువు లేదా విడాకులు తీసుకున్న మహిళలకు మాత్రమే)
గతేడాది ఎంత మంది పిల్లలకు జన్మనిచ్చారు? (వివాహిత మహిళలకు మాత్రమే)
కోవిడ్-19 టీకా ఎక్కడ వేయించుకున్నారు?
మొత్తం ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయి?
మీ మొబైల్ నంబర్ ఏమిటి? (అందుబాటులో ఉంటే)
మీ ఆధార్ నంబర్ ఏమిటి? (అందుబాటులో ఉంటే)
మీ ఓటరు గుర్తింపు సంఖ్య ఏమిటి? (అందుబాటులో ఉంటే)
మీ పాస్‌పోర్ట్ నంబర్ ఏమిటి? (భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నట్లయితే)
డ్రైవింగ్ లైసెన్స్ ఉందా?
ALSO READ: పొట్టకూటి కోసం నేలను తవ్వితే.. రూ.50 లక్షల వజ్రం దొరికింది.. జాక్ పాట్ కొట్టిన కూలీలు!