E-Paper
Advertisement

పొట్టకూటి కోసం నేలను తవ్వితే.. రూ.50 లక్షల వజ్రం దొరికింది.. జాక్ పాట్ కొట్టిన కూలీలు!

పొట్టకూటి కోసం నేలను తవ్వితే.. రూ.50 లక్షల వజ్రం దొరికింది.. జాక్ పాట్ కొట్టిన కూలీలు!
Advertisement

Panna Diamond Mine: మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వజ్రాల గనులే. ప్రతిరోజూ వేలాది మంది కూలీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, పొట్టకూటి కోసం ఈ గనుల్లో రాత్రింబవళ్లు చెమటోడుస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ లీజు గనిలో ఏడుగురు రోజువారీ కూలీలు ఎప్పటిలాగే తవ్వకాలు ప్రారంభించారు. ఈ క్రమంలో వారి జీవితాలను మలుపు తిప్పే అదృష్టం వారిని వరించింది. ఎవరూ ఊహించని స్థాయిలో అతి అరుదైన వజ్రం వారి చేతికి చిక్కింది.

రూ.50 లక్షల డైమండ్ ప్రత్యక్షం!

కూలీలు గనిలో మట్టిని తొలగిస్తుండగా ఒక్కసారిగా ఓ మెరిసే రాయి వారి కంటపడింది. తీసి చూస్తే అది సాధారణ రాయి కాదు. ఏకంగా 17.96 క్యారెట్ల నాణ్యమైన వజ్రం (Rough Diamond) వజ్రం. అంతపెద్ద వజ్రాన్ని చూసిన ఆ కూలీల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మార్కెట్‌లో దీని విలువ దాదాపు రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఒకే ఒక్క వజ్రంతో ఆ ఏడుగురు కూలీలు.. లక్షాధికారులుగా మారిపోయారని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంత భారీ వజ్రం.. ఫస్ట్ టైమ్!

Advertisement

పన్నాలో గతంలోనూ నాణ్యమైవ వజ్రాలు బయటపడ్డాయి. కానీ ఈ స్థాయిలో 17.96 క్యారెట్ల భారీ వజ్రం దొరకడం చాలా అరుదైన విషయమని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే లభించిన ఈ అమూల్యమైన వజ్రాన్ని కూలీలు నిబంధనల ప్రకారం స్థానిక వజ్రాల అధికారి (Diamond Officer) కార్యాలయంలో అప్పగించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈ వజ్రానికి త్వరలోనే అధికారికంగా వేలం పాట (Official Auction) నిర్వహిస్తారు. వచ్చిన మొత్తం నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ, పన్నులను మినహాయిస్తారు.

Also Read: ప్రతీ రోజూ 1.5GB డేటా ఇచ్చే.. రూ.330 లోపు జియో ప్లాన్స్.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్ ఫ్రీ!

కూలీలకు సమానంగా పంపిణీ

Advertisement

ఆపై మిగిలిన అత్యధిక మెుత్తాన్ని ఆ ఏడుగురు కూలీలకు అధికారులు సమానంగా పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. రోజూ కష్టపడితేగానీ కడుపు నిండని ఆ సాధారణ కూలీల పాలిట ఈ వజ్రం ఒక కొండంత అభయాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. మెుత్తం మీద కష్టజీవులను వరించిన ఈ అదృష్టం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Also Read: BSNL బిగ్ ధమాకా ప్లాన్.. రూ. 319 కే 65 రోజుల వ్యాలిడిటీ.. ఇదేం ఆఫర్ బాబోయ్!

Tags

Related News

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

LPUలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. హాస్టల్‌లో లైంగిక దాడి ఆరోపణలు.. రణరంగంగా మారిన క్యాంపస్!

యూపీఐ ఛార్జీల వివాదం.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నో.. కానీ కేంద్రానికి కీలక ఆదేశాలు!

పబ్లిక్ టాయిలెట్ లో ఇద్దరు యువకుల శవాలు.. ఎవరు చంపారు?

కోయంబత్తూరు హైవేపై సినిమా తరహాలో.. హెడ్ కానిస్టేబుల్ సాహసం, ఏకంగా 40 కి.మీ ప్రయాణం

Big Stories

Advertisement
×