E-Paper
Advertisement

మోడీని ఎదుర్కొనే దమ్ములేక ఈసీ, ఈవీఎంలపై నిందలా? కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్!

మోడీని ఎదుర్కొనే దమ్ములేక ఈసీ, ఈవీఎంలపై నిందలా? కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్!
Advertisement

Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: ప్రధాని మోడీని ఎదుర్కొనే దమ్ము లేక ఈసీపై, ఈవీఎంలపై కాంగ్రెస్ నిందలేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శికంచారు. కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచినప్పుడు సీడబ్ల్యూసీకి ఈవీఎంలు గుర్తుకురాలేదా అని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్..

Advertisement

ఎస్ఐఆర్ ప్రకియ వల్లే గెలిచామని కేరళ కాంగ్రెస్ నేతలు ప్రకటించిన విషయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మర్చిపోయిందా? అని ధ్వజమెత్తారు. అలాంటిది ప్రధాని మోడీ ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. మూడుసార్లు వరుసగా దేశ ప్రజలు అప్రతిహతంగా గెలిపించినందుకు రాజీనామా చేయాలా? అని నిలదీశారు. మోడీ ప్రభుత్వాన్ని బ్రిటీష్ పాలనతో పోల్చడం హేయనీయమని కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.

సరిదిద్దుకునే వ్యవస్థ ఉంది కదా?

Advertisement

ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అపహస్యం చేయడమే అవుతుందన్నారు. ఎస్ఐఆర్ సిబ్బంది అంతా రాష్ట్ర ప్రభుత్వ అధికారులేనని, ఎస్ఐఆర్ లో పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునే వ్యవస్థ ఉంది కదా? అని నిలదీశారు. కేంద్రంపై నెపం నెట్టడం దుర్మార్గమని, ఇటలీ మూలాలున్న కాంగ్రెస్ నేతలకు భారత ప్రజాస్వామ్యమంటే చులకన అని విరుచుకుపడ్డారు. ఎస్ఐఆర్ కొత్త ప్రక్రియ కానేకాదని, గతంలోనూ ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగించారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు కూడా ఎస్ఐఆర్ ను సమర్థించిందని సంజయ్ వెల్లడించారు. అర్హుడైన ఏ ఒక్క ఓటరు పేరు పోకూడదని, అనర్హుడైన వాళ్లు ఓటర్ జాబితాలో ఉండకూడదన్నదే ఎస్ఐఆర్ ఉద్దేశమన్నారు.

ఎన్నికల సంఘం చేసిన తప్పేంటి?

ఎన్నికల్లో ఎవరు గెలవాలనేది ప్రజలు నిర్ణయిస్తారని, ఎన్నికల్లో ఎవరు ఓటు వేయాలనేది చట్టబద్ధమైన ఓటరు జాబితా నిర్ణయిస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు పవిత్రమైనదైతే, ఓటరు జాబితా కూడా అంతే పవిత్రంగా ఉండాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో ఎన్నికల సంఘం చేసిన తప్పేంటని? ఆధారాలుంటే బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Also Read: ఎమ్మెల్సీ బరిలో ఆ ఇద్దరు నేతలు.. రేవంత్ రెడ్డి మార్క్ మాస్టర్ ప్లాన్!

Tags

Related News

ఒకటి రెడ్డి.. మరొకటి బీసీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యూహం ఫలించేనా?

తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు బంపర్ ఆఫర్..11 కేవీ కనెక్షన్లపై సరికొత్త నిబంధనలు!

నర్సింగ్ కౌన్సిల్ ఖాతాల్లో కోట్ల రూపాయలు.. మరి ఆ డబ్బంతా ఏమైనట్లు?

ఎమ్మెల్సీ బరిలో ఆ ఇద్దరు నేతలు.. రేవంత్ రెడ్డి మార్క్ మాస్టర్ ప్లాన్!

రాహుల్ కాదు కదా.. ఆయన జేజమ్మ వచ్చినా మోడీని ఏమీ చేయలేరు: ఈటల రాజేందర్

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

Big Stories

Advertisement
×