Braeking News : బయటకు వెళ్లాలి బైక్ బుక్ చేయ్. షాపింగ్‌కు పోదాం క్యాబ్ బుక్ చేయ్. ఆఫీసుకు, హాస్పిటల్‌కు, ఆలయాలకు, అల్లంత దూరాలకు.. ఎటూ వెళ్లాలన్నా క్యాబ్‌లే. కారు, బైకు గట్రా లేని వాళ్లు.. ఉన్నా ట్రాఫిక్‌లో నడపడం ఇష్టం లేని వారంతా.. ఉబర్, ఓలా, రాపిడోలపైనే డిపెండ్ అవుతుంటారు. అందుకే ఆ మూడు కంపెనీల బిజినెస్.. మూడు బైక్‌లు, ఆరు కార్లుగా సాగుతోంది. ఆయా సంస్థలు కోట్లలో బిజినెస్ చేస్తున్నాయి. డ్రైవర్లకు మాత్రం ఎప్పుడూ అంతంత ఆదాయమే. వాహనాలు వాళ్లవే.. డీజిల్ వాళ్లదే.. నడిపేది వాళ్లే.. జస్ట్ ప్లాట్‌ఫామ్ వాడుకున్నందుకు భారీగా కమిషన్లు తీసుకుంటాయి కంపెనీలు. రేట్లు పెంచాలంటూ తరుచూ డ్రైవర్లు ధర్నాలు, బంద్‌లు గట్రా చేస్తుంటారు కూడా. ఇప్పుడు ఆ డ్రైవర్లకు మరో చిక్కు వచ్చి పడింది. ఈసారి ఏకంగా ఓలా, ఉబర్, రాపిడో సేవలను.. 6 వారాల్లోగా నిలిపివేయాలని ఆదేశించింది హైకోర్టు. ఈ ఉత్తర్వులు కార్లకు కాదు.. కేవలం బైక్ సర్వీసులకు మాత్రమే.
బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎందుకంటే..
యాప్ ఆధారిత బైక్ రైడ్ సేవలు నిలిపివేయాలని కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారాయి. టూవీలర్ వాహనాల రిజిస్ట్రేషన్లను ప్యాసింజర్ వెహికిల్స్‌గా మాత్రమే కాకుండా.. వాటిని రవాణా వాహనాల కేటగిరిలోనూ అనుమతించాలంటూ ఉబర్, ఓలా, రాపిడో లాంటి సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి. అయితే, మోటార్ వెహికిల్ చట్టం – 1988 ప్రకారం అటువంటి బైక్ ట్యాక్సీ సేవలకు పర్మిషన్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనలను మార్చాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఆయా కంపెనీలు తమ బైక్ ట్యాక్సీ సర్వీసులను నిలిపివేయాలంటూ హైకోర్టు సూచించింది. బైక్ టాక్సీ కార్యకలాపాలకు అవసరమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 3 నెలలు టైమ్ ఇచ్చింది. అప్పటి వరకు కర్నాటకలో ఓలా, ఉబర్, రాపిడో బైక్ సేవలు బంద్.
Also Read : బంగారం రప్పారప్పా.. ఇప్పుడే కొనేయండి..
రూల్స్ మార్చాల్సిందేనా..?
గత ఏడాది మార్చిలో బైక్ టాక్సీ సేవలపై నిషేధాన్ని నోటిఫై చేసింది అక్కడి ప్రభుత్వం. జూలై 14, 2021న నోటిఫై చేసిన కర్ణాటక ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ పథకాన్ని కూడా విత్‌డ్రా చేసుకుంది. సర్కారు నిర్ణయంపై క్యాబ్ సర్వీసు కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. తాజాగా, ఆ రూల్స్ సంగతేంటో చూడాలంటూ.. ప్రభుత్వానికే ఆ బాధ్యత అప్పగించింది హైకోర్టు. నిబంధనలు సవరిస్తే కానీ రవాణా శాఖ ప్యాసింజర్ టూవీలర్ వెహికిల్స్‌ను ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్స్‌గా అనుమతించలేదు. అందుకే, కొత్త రూల్స్ వచ్చే వరకు కర్నాటకలో యాప్ ఆధారిత బైక్ ట్యాక్సీ సేవలపై నిషేధం విధించింది హైకోర్టు.