Big Stories

Bangladesh MP Murder: వలపు వలతో ఎంపీ హత్య.. చర్మాన్ని ఒలిచి.. ముక్కలుగా నరికి..!

Bangladesh MP Anwarul Azim Anar Murder Case: బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్వరుల్ అజీమ్ చికిత్స కోసం బంగ్లాదేశ్ నుంచి ఈ నెల 12న కోల్ కతా వచ్చారు. అయితే మే 14 నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఎంపీ హత్య కేసుకు సంబంధించి ఓ అనుమాతుడిని బెంగాల్ సీఐడీ టీం అరెస్ట్ చేయగా భయంకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళ ఆయనను వలపు వలలోకి లాగి హత్య చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

హత్య అనంతరం మృతదేహాన్ని అదృశ్యం చేసేందుకు నిందితులు దారుణంగా ప్రవర్తించారు. డెడ్ బాడీపై చర్మాన్ని ఒలిచి.. ముక్కలుగా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు విచారణలో భాగంగానే పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. అమెరికాకు చెందిన ఓ మిత్రుడు కోల్ కతాలో అద్దెకు తీసుకున్న అపార్టుమెంట్ లోకి ఇద్దరు పురుషలు..ఓ మహిళతో కలిసి వెళ్లిన ఆయన ఆ తర్వాత తిరిగి రాలేదని పోలీసులు గుర్తించారు. ఓ మహిళతో హనీ ట్రాప్ చేయించి అపార్టుమెంట్ లోనికి రప్పించి ఉంటారని అనుమానిస్తున్నారు.

- Advertisement -

అయితే ఆ మహిళ అన్వరుల్ స్నేహితుడికి సన్నిహితురాలిగా పోలీసులు గుర్తించారు. ఆయన స్నేహితుడు అన్వరుల్ ను చంపేందుకు రూ. 5 కోట్లు ఖర్చు చేశాడని, అందులో నిందితులకు వాటాలు కూడా ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న ఆధారాలను పరిశీలిస్తే ఎంపీని గొంతు నలిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఉంటారని అనుమానిస్తున్నారు. అనంతరం చర్మాన్ని వేరు చేసి..దుర్వాసన రాకుండా పసుపు కలిపి పెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే కొన్ని భాగాలను ఫ్రిడ్జ్ లో పెట్టినట్లుగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కొన్ని భాగాలను ప్లాస్టిక్ బ్యాగుల్లో తీసుకొని వివిధ ప్రదేశాల్లో పడేసి ఉంటారని చెబుతున్నారు.

Also Read: బెంగుళూరు రేవ్ పార్టీ.. ముగ్గురు పోలీసులపై వేటు

అయితే ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ లోకి వచ్చిన వలసదారుడు జిహాద్ హవల్దార్ ను ముంబాయిలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యలో అతడే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అయితే మృతుడు ఎంపీ, స్నేహితుడి ఆదేశాలతోనే ఎంపీని హత్య చేసి మృతదేహాన్ని గుర్తించడానికి వీలు లేకుండా చేసినట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News