BigTV English

Bihar Cm Nitish : డీజీపీకి చేతులు ఎత్తి మొక్కిన సీఎం, ప్రతి నమస్కారం పెట్టిన పోలీస్ బాస్, కారణం ఇదే

Bihar Cm Nitish : డీజీపీకి చేతులు ఎత్తి మొక్కిన సీఎం, ప్రతి నమస్కారం పెట్టిన పోలీస్ బాస్, కారణం ఇదే

Bihar Cm Nitish Kumar : బీహార్ రాష్ట్రంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఓ పోలీస్ కార్యక్రమంలో భాగంగా స్వయంగా చేతులెత్తి నమస్కారం తెలిపారు. అది కూడా ఓ ఓటర్ కో, లేక ఓ సామాన్యులకో కాదు. ఆ రాష్ట్ర డీజీపీకే పెట్టారు. దీంతో పోలీస్ బాస్ సైతం ఆశ్చర్యపోయారు. అంత పెద్దాయనే తనకు అందరి ముందు సభలో నమస్కారం పెడుతుండటంతో తిరిగి ప్రతి నమస్కారం చేస్తూ ఎస్ సార్ అంటూ బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.


అసలు విషయం ఏంటంటే…

బిహార్ లో 1,239 మంది పోలీస్ అధికారులు కొత్తగా ఎంపికయ్యారు. దీంతో వారందరికీ నియామక పత్రాలు అందజేసేందుకు ముఖ్య అతిథిగా సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్నారు. అయితే ఒక్కో పోలీస్ అధికారికి, నియామక పత్రాలు అందిస్తూ వచ్చారు.


మధ్యలోనే ఆగిన సీఎం…

అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రసంగం మధ్యలో ఆగిపోయారు. ఎందుకా అని చూస్తే, డీజీపీ అలోక్ రాజ్ వైపు చూస్తూ ఓ మాట చెప్పారు.

ఎస్ సార్…

డీజీపీ గారు, పోలీస్ నియామకాలు త్వరగా జరిగేలా చూస్తారా అంటూ చేతులు జోడించి అడిగారు. ఊహించిన పరిణామంతో డీజీపీ సైతం సీఎంకు అవునంటూ సెల్యూట్ కొట్టారు. ఈ క్రమంలోనే మైక్ వద్దకు వెళ్లిన పోలీస్ బాస్ అలోక్ రాజ్, సీఎం ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

నియామకాలు పూర్తి చేస్తాం…

త్వరలోనే పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమిస్తామని, వారికి సుశిక్షణ సైతం అందిస్తామన్నారు. దీంతో సంతోషపడ్డ ముఖ్యమంత్రి, డీజీపీకి ధన్యవాదాలు తెలియజేశారు.

Also Read : విద్యుత్ ఛార్జీల మోతకు మేం వ్యతిరేకం, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌’ను కలిసి ఫిర్యాదు చేసిన కేటీఆర్

 

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×