Bihar Girl PM Modi| భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించే అవకాశం ఒక టీనేజ్ బాలికకు దక్కింది. ప్రధాన మంత్రి మోదీకి చెందిన ప్రసిద్ధ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ ద్వారా దేశ ప్రజలతో తరుచూ మాట్లాడుతుంటారు. ఈ కార్యక్రమంలోనే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘పరీక్షా పర్ చర్చ’ (పరీక్షలపై చర్చ) అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ప్రధాని నిర్వహిస్తారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన విద్యార్థులు ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడి, తమ సందేహాల గురించి ఆయనను ప్రశ్నించ గలిగేందుకు అవకాశం ఉంది.
ఈ ఏడాది ఈ కార్యక్రమానికి బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్ జిల్లాకు చెందిన సుపర్ణ అనే బాలిక ఎంపికైంది. భాగల్పూర్‌లోని సాహెబ్‌గంజ్ ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న సుపర్ణ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని గవర్నమెంట్ గర్ల్స్ ఇంటర్ లెవల్ హై స్కూల్‌లో 11వ తరగతి చదువుకుంటోంది.
సుపర్ణను ఈ కార్యక్రమానికి ఎంపిక చేయడం పలు దశల ఇంటర్వ్యూలు ద్వారా జరిగింది. విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం, ప్రత్యేకంగా నియమించబడిన టీచర్స్ ట్రైనింగ్ కాలేజీ ప్రొఫెసర్లు విద్యార్థులతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూల ఆధారంగా మాత్రమే విద్యార్థులను ఎంపిక చేస్తారు.
ఈ సందర్భంగా సుపర్ణ తన ఆనందాన్ని మీడియాతో పంచుకుంది. “నన్ను ఈ కార్యక్రమానికి ఎంపిక చేసిన అధికారులకు ధన్యవాదాలు. ఇది నాకు జీవితంలో ఒక గొప్ప అవకాశం. పరీక్షలకు సంబంధించిన నా అనుభవాలను అందరితో పంచుకుంటాను,” అని పేర్కొంది.
Also Read: కశ్మీర్‌లో వింత వ్యాధితో వరుస మరణాలు.. రంగంలోకి కేంద్ర బృందం!
‘పరీక్షా పర్ చర్చ’ రేడియో కార్యక్రమం
‘పరీక్షా పర్ చర్చ’ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రతి సంవత్సరం బోర్డు పరీక్షల ముందు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి మొదటగా ‘ఎగ్జామ్ వారియర్స్’ అని పేరు పెట్టారు. విద్యార్థుల పరీక్షల ఒత్తిడిని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో విద్యార్థులతో ముచ్చటిస్తూ, పరీక్షల సమయంలో ఒత్తిడి నివారణ, సమయ నిర్వహణ, ఉత్తమ ఫలితాలను సాధించడానికి అనుసరించాల్సిన మార్గాల గురించి సూచనలు చేస్తారు.
గత ఏడాది ఈ కార్యక్రమం జనవరి 29న జరిగింది. ఈసారి ఈ కార్యక్రమం నిర్వహణ తేదీని ప్రధానమంత్రి కార్యాలయం త్వరలో ప్రకటించనుంది.
సుపర్ణకు అరుదైన అవకాశం
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపికైన సుపర్ణ, తన బోర్డు పరీక్షల అనుభవాలను ప్రధాని మోదీతో పంచుకోవడమే కాకుండా, తన సందేహాలను నేరుగా ప్రధాని మోదీని అడిగే అవకాశం పొందబోతోంది. ఇది ఆమెకు మాత్రమే కాకుండా, బీహార్ రాష్ట్రానికే గర్వకారణం అని కుటుంబం తెలిపింది.
‘పరీక్షా పర్ చర్చ’ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో, వారి అభ్యాస పద్ధతులను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోందని సువర్ణ అధ్యాపకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.