పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (Pakistan vs England) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా మొత్తం మూడు టెస్టులు జరగనున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ ముగిసింది. ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్ విక్టరీ అందుకుంది. అటు పాకిస్తాన్ మూడు రోజుల్లోనే దారుణ ఓటమిని చవి చూసింది. ఈ మ్యాచ్ కంటే ముందు కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam) చేతికి గాయమైంది. దీంతో అతని స్థానంలో సల్మాన్ అలీ అఘా కెప్టెన్ గా వ్యవహరించాడు. అతని వల్లే మొదటి మ్యాచ్ ఓడిపోయిందని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
మొదటి టెస్ట్ మ్యాచ్ లో బాబర్ ఆజం లేకపోవడం వల్లే, పాకిస్తాన్ ఓడిపోయిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో రెండో టెస్ట్ లో కచ్చితంగా బాబర్ ఆజం ఆడించాల్సిందేనని కోరుతున్నారు. లేకపోతే పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాబర్ ఆజం రెండు టెస్ట్ లో ఆడడంపై తాజాగా మార్క్ బెచర్ ( mark butcher ) కీలక వ్యాఖ్యలు చేశారు. బావర్ గాయం మానకపోయినా రెండో టెస్టులు ఆడాల్సిందేనని సూచించారు. వీల్ చైర్ పైన వచ్చేనా ప్రాతినిధ్యం వహించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ బాబర్ ఆజం ఆడకపోతే మొదటి మ్యాచ్ లోనే పాకిస్తాన్ ఓడిపోవడం గ్యారంటీ అని వార్నింగ్ కూడా ఇచ్చారు. గాయాన్ని ఓర్చుకొని, ముందుకు సాగాలని.. వివరించారు. లేకపోతే ఈ టెస్ట్ సిరీస్ చాలా చప్పగా సాగుతుందని స్పష్టం చేశారు మార్క్ బెచర్ ( mark butcher ).
ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆగస్టు 27వ తేదీ అంటే ఎల్లుండి నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ లో కూడా బాబర్ ఆడేది డౌట్ అని అంటున్నారు. అతని చేతి గాయం ఇంకా మానలేదని.. దీంతో అతన్ని తప్పిస్తారని అంటున్నారు. నిజంగానే బాబర్ ఆజం రెండో టెస్టులు ఆడక పోతే, సల్మాన్ అలీ కాకుండా షాన్ మసూద్ కు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు.
ఇప్పటికే తనకు పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్సీ వద్దని సల్మాన్ అలీ మొత్తుకుంటున్నాడు. కెప్టెన్సీ కాకుండా సాధారణ ప్లేయర్ గానే బరిలోకి దిగుతానని ఈ వెల్లడించాడు. దీంతో షాన్ మసూద్ కు కెప్టెన్సీ అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ షాన్ మసూద్ కూడా తుది జట్టు నుంచి తప్పుకుంటే… మహమ్మద్ రిజ్వాన్ కు అవకాశం వచ్చే ఉన్నట్లు చెబుతున్నారు.