E-Paper
Advertisement

వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. జడ్జీల ప్యానెల్‌పై పడ్డ రోబో.. స్ట్రెచ్చర్‌పై తరలింపు!

వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. జడ్జీల ప్యానెల్‌పై పడ్డ రోబో.. స్ట్రెచ్చర్‌పై తరలింపు!
Advertisement

Beijing Robot Games: బీజింగ్‌లో జరుగుతున్న సెకండ్ ఎడిషన్ ‘వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్’ అద్భుతంగా సాగుతున్నాయి. 16 దేశాల నుండి వచ్చిన 2,000 కంటే ఎక్కువ రోబోలు.. దాదాపు 51 పోటీలలో పాల్గొంటూ వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ రోబో గేమ్స్ లో వినోదంతో పాటు నాటకీయ పరిణామాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. వెయిట్ లిఫ్టింగ్ లో తలపడుతున్న ఓ రోబో కంట్రోల్ తప్పి జడ్జీల ప్యానెల్ పై పడిపోవడం అందరనీ షాక్ కు గురిచేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పోటీల్లో భాగంగా సోమవారం జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్స్ లో ఈ ఊహించని ఘటన జరిగింది. ఓ రోబో బరువును ఎత్తుతూ ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి నేరుగా జడ్జీల ప్యానెల్‌పైకి పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం తర్వాత నిర్వాహకులు ఆ రోబోను స్ట్రెచ్చర్‌పై బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే బీజింగ్ హ్యూమనాయిడ్-హస్ట్ (HUST) టీమ్‌కు చెందిన రోబో ఏకంగా 16 కిలోగ్రాముల (35 పౌండ్లు) బార్‌బెల్‌ను విజయవంతంగా తలపైకి ఎత్తి ఈ ఈవెంట్‌లో తొలి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు ట్రాక్ ఈవెంట్లలో చైనాకు చెందిన ఒక హ్యూమనాయిడ్ రోబో సరికొత్త చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన 100 మీటర్ల ప్రిలిమినరీ హీట్స్‌లో ‘టియాంగోంగ్ ఆల్ట్రా’ అనే రోబో కేవలం 9.39 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని, గతంలో దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ పేరిట ఉన్న 9.58 సెకన్ల ప్రపంచ రికార్డును అధిగమించింది.

Advertisement

Also Read: ఫీజు రీయంబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్య అంటే నమ్మాలా?.. బండి సంజయ్ చురకలు

బీజింగ్ హ్యూమనాయిడ్ రోబో ఇన్నోవేషన్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ రోబో.. రేస్ ప్రారంభంలో కొద్దిగా వెనుకబడినప్పటికీ.. చివరి వచ్చే సరికి హానర్ (Honor) కంపెనీకి చెందిన ‘లైట్నింగ్’ రోబోను వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది. రన్నరప్‌గా నిలిచిన ‘లైట్నింగ్’ రోబో కూడా 9.47 సెకన్లలో రేసును పూర్తి చేసి బోల్ట్ రికార్డును అధిగమించడం విశేషం. ఇదిలా ఉంటే గతేడాది జరిగిన మొదటి ఎడిషన్ పోటీల్లో టియాంగోంగ్ ఆల్ట్రా రోబో 100 మీటర్ల రేసును పూర్తి చేయడానికి 21.50 సెకన్ల సమయం తీసుకోగా ఈసారి ఏకంగా 9.39 సెకన్లకే టార్గెట్ ను చేరుకోవడం సాంకేతికతలో వస్తున్న పురోగతికి అద్దం పడుతోంది.

Also Read: దేశంలో ఫస్ట్ హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ రెడీ.. వందే భారత్‌కు మించి వేగంతో దూసుకెళ్లనున్న రైళ్లు!

Tags

Related News

ఆఫర్ల ఆశ.. సైబర్ మోసాల మోత! ఆన్‌లైన్‌లో కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

తక్కువ బడ్జెట్‌లో సూపర్ సౌండ్..40 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఇయర్‌బడ్స్

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్..తక్కువ ధరలో భారీ స్క్రీన్

వన్‌ప్లస్ ఫోన్లలో ఇక సరికొత్త లుక్ అండ్ స్పీడ్.. ColorOS 17 అప్‌డేట్ ఎలా చేసుకోవాలంటే?

ఔటింగ్స్, పార్టీల కోసం పర్‌ఫెక్ట్ స్పీకర్..రూ.1,999కే అదిరిపోయే సౌండ్!

ఆఫ్‌సీజన్‌లో ఇంత తక్కువకా? అమెజాన్ సేల్‌లో సగానికి సగం తగ్గిన 5-స్టార్ ఏసీల ధరలు!

సూపర్ ప్రాసెసర్, కొత్త డిజైన్‌తో iPad Mini 8.. కానీ ఆ విషయంలో యాపిల్ నిరాశపరిచింది!

సేల్‌లో..టీవీలపై భారీ డిస్కౌంట్! ఎగబడి కొంటున్న జనం

Big Stories

Advertisement
×