E-Paper
Advertisement

బడ్జెట్ యూజర్లకు పండగే పండగ.. రూ.10 వేలలోపు మూడేళ్ల వారంటీతో Realme C100i వస్తోంది!

బడ్జెట్ యూజర్లకు పండగే పండగ.. రూ.10 వేలలోపు మూడేళ్ల వారంటీతో Realme C100i వస్తోంది!
Advertisement

Realme C100i: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రియల్‌మీ మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. కంపెనీ C సిరీస్‌లో భాగంగా రియల్‌మీ C100iని భారత మార్కెట్లోకి పరిచయం చేయనుంది. ముఖ్యంగా భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, సుదీర్ఘ వారంటీ ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఆగస్టు 27న భారత్‌లో లాంచ్:

రియల్‌మీ C100i ఆగస్టు 27న భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. లాంచ్ రోజు నుంచే ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయానికి రానుంది. అయితే ప్రస్తుతానికి ధరను కంపెనీ వెల్లడించలేదు. బడ్జెట్ సెగ్మెంట్‌లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ RMX5399 మోడల్ నంబర్‌తో వస్తోంది.

Advertisement

Also Read: రూ.499కే పిల్లల కోసం కిరాక్ గ్యాడ్జెట్.. పోర్ట్రానిక్స్ సరికొత్త రఫ్ ప్యాడ్స్ ఫీచర్లివే!

120Hz డిస్‌ప్లే.. 6,500mAh బ్యాటరీ:

ఈ Realme C100i ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే అందిస్తున్నారు. దీంతో స్క్రోలింగ్, యాప్స్ వినియోగం మరింత స్మూత్‌గా ఉండే అవకాశం ఉంది. ఇక బ్యాటరీ విషయంలో రియల్‌మీ భారీగా అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో 6,500mAh బ్యాటరీ ఉంది. రోజువారీ వినియోగంలో ఎక్కువసేపు బ్యాకప్ అందించడంతో పాటు, ఈ బ్యాటరీ ఐదేళ్ల వరకు మన్నికగా ఉండేలా రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది.

4GB RAM.. 128GB వరకు స్టోరేజ్:

Advertisement

రియల్‌మీ C100i 4GB RAMతో 64GB, 128GB స్టోరేజ్ వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. స్కైలైన్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్లో లభించనుంది. ఫోన్‌కు ఆర్మర్‌షెల్ ప్రొటెక్షన్ కూడా అందిస్తున్నారు. దీంతో డిజైన్‌తో పాటు మన్నికపై కూడా కంపెనీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

మూడేళ్ల వారంటీ.. ధరపైనే ఆసక్తి:

Realme C100iలో మరో ఆసక్తికరమైన అంశం 36 నెలల వారంటీ. బడ్జెట్ ఫోన్లలో సాధారణంగా ఇంత సుదీర్ఘ వారంటీ కనిపించదు. దీంతో రియల్‌మీ C100i ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. 120Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, మూడేళ్ల వారంటీతో వస్తున్న ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందనేదే ఇప్పుడు అసలు ఆసక్తికరంగా మారింది.

Also Read: 64% పవర్ సేవింగ్ టెక్నాలజీతో షియోమీ కొత్త డివైజ్‌లు.. భారత్‌లోకి ఎప్పుడంటే?

Tags

Related News

ఆఫర్ల ఆశ.. సైబర్ మోసాల మోత! ఆన్‌లైన్‌లో కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

తక్కువ బడ్జెట్‌లో సూపర్ సౌండ్..40 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఇయర్‌బడ్స్

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్..తక్కువ ధరలో భారీ స్క్రీన్

వన్‌ప్లస్ ఫోన్లలో ఇక సరికొత్త లుక్ అండ్ స్పీడ్.. ColorOS 17 అప్‌డేట్ ఎలా చేసుకోవాలంటే?

ఔటింగ్స్, పార్టీల కోసం పర్‌ఫెక్ట్ స్పీకర్..రూ.1,999కే అదిరిపోయే సౌండ్!

ఆఫ్‌సీజన్‌లో ఇంత తక్కువకా? అమెజాన్ సేల్‌లో సగానికి సగం తగ్గిన 5-స్టార్ ఏసీల ధరలు!

సూపర్ ప్రాసెసర్, కొత్త డిజైన్‌తో iPad Mini 8.. కానీ ఆ విషయంలో యాపిల్ నిరాశపరిచింది!

సేల్‌లో..టీవీలపై భారీ డిస్కౌంట్! ఎగబడి కొంటున్న జనం

Big Stories

Advertisement
×