BigTV English

BJP MLA Devender Rana: బిజేపీ ఎమ్మెల్యే దేవేందర్ రాణా మృతి

BJP MLA Devender Rana: బిజేపీ ఎమ్మెల్యే దేవేందర్ రాణా మృతి

BJP MLA Devender Rana| బిజేపీ నాయకుడు, జమ్ము కశ్మీర్ లోని నాగరోట నియోజకవర్గం ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా గురువారం రాత్రి కన్నుమూశారు. 59 ఏళ్ల బిజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన దేవేందర్ సింగ్ రాణా గత కొన్ని రోజులుగా హర్యాణా ఫరీదాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ మరణించారు.


కేంద్ర మంద్రి జీతేందర్ సింగ్ రాణా సోదరుడు దేవేందర్ సింగ్ రాణా. దేవేందర్ సింగ్ రాణా కు భార్య గుంజన్ దేవి, ముగ్గురు పిల్లలు.. కుమార్తెలు దేవయాని, కేత్కీ, కొడుకు అధిరాజ్ సింగ్ ఉన్నారు. ఎమ్మెల్యే దేవేందర్ రాణా మరణించారని తెలియగానే చాలామంది రాజకీయ నాయకులు జమ్మూ గాంధీనగర్ ప్రాంతంలోని ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. కేంద్ర మంత్రి జీతేందర్ సింగ్ రాణా కూడా తన సోదరుడు మరణి వార్త గురించి తెలియగానే ఢిల్లీ నుంచి నాగరోటకు బయలుదేరినట్లు సమాచారం.

దేవేందర్ సింగ్ వందల సంఖ్యలో రాజకీయ నాయకులు
ప్రస్తుతం దేవేందర్ సింగ్ రాణా ఇంటి వద్ద వందల సంఖ్యలో రాజకీయ నాయకులు సంతాపం తెలిపేందుకు చేరినట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా రాణా మృతి వార్త గురించి వినగానే దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. “దేవేందర్ సింగ్ రాణా ఆకస్మిక మరణం గురిచి తెలిసి చాలా బాధ కలిగింది. ఆయన మృతిలో మనం ఒక దేశభక్తుడిని, ఒక జనాభిమానం ఉన్న నాయకుడిని కోల్పోయాం. ఆయన జమ్మూ కశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి” అని గవర్నర్ మనోజ్ సిన్హా ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.


ఎమ్మెల్మే దేవేందర్ రాణా మృతి పట్ల జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఉపముఖ్యమంత్రి సురిందర్ కుమార్ చౌదరి, కాంగ్రెస్ ఎమ్మెల్యే గులామ్ అహ్మద్ మీర్, పిడిపి అధినాయకురాలు మెహ్‌బూబా ముఫ్తీ సంతాపం తెలిపారు.

దేవేందర్ సింగ్ రాణా ఎవరు?
దేవేందర్ సింగ్ రాణా ఒక ప్రజానాయకుడు, ఒక వ్యాపారవేత్త. జమ్మూ కశ్మీర్ లోని డోగ్రా సామాజిక వర్గానికి చెందిన రాజిందర్ సింగ్ రాణా కుమారుడు దేవేందర్ సింగ్ రాణా. దేవేందర్ సింగ్ తండ్రి రాజిందర్ సింగ్ కూడా ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి. దేవేందర్ సింగ్ రాజకీయాల్లోకి రాకముందు ఎన్ఐటి కురుక్షేత్ర నుంచి సివిల్ ఇంజీనిరింగ్ పూర్తిచేశారు. ఆ తరువాత జమ్‌కాష్ వెహికలేడ్స్ గ్రూప్ అనే కంపెనీ స్థాపించారు. దీంతో పాటు ఆయనకు స్వయంగా ఒక టీవి ఛెనెల్ కూడా ఉంది.

జమ్మూ కశ్మీర్ ప్రధాన రాజకీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫెరెన్స్ తో ఆయన రాజకీయంగా ఎంట్రీ ఇచ్చారు. జమ్మూ ప్రాంతంలో విపరీత ప్రజాదరణ ఉన్న దేవేందర్ సింగ్ ఒమర్ అబ్దుల్లా సలహాదారునిగా కూడా పనిచేశారు. ఆయన బిజేపీ ఎంపీ జుగల్ కిషోర్ శర్మను నాగరోట లోక్ సభ ఎన్నికల్లో ఓడించారు. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు కోసం ఆయన పాటుపడ్డారు. నేషనల్ కాన్ఫెరెన్స్ లో రెండు దశాబ్దాల పాటు సభ్యుడిగా ఉన్న దేవేందర్ 2021 అక్టోబర్ లో బిజేపీ లోకి చేరారు. ఆ తరువాత ఇటీవల జరిగిన జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×