E-Paper
Advertisement

Nara lokesh in Atlanta: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. జగన్‌పై మంత్రి లోకేష్ ఆగ్రహం, త్వరలో రెడ్‌బుక్‌..

Nara lokesh in Atlanta: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. జగన్‌పై మంత్రి లోకేష్ ఆగ్రహం, త్వరలో రెడ్‌బుక్‌..
Advertisement

Nara lokesh in Atlanta: మాజీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి నారా లోకేష్. వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఏపీ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారని అన్నారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తితోపాటు ఉద్యోగాల్లో మహిళలకు అవకాశం ఇచ్చారన్నారు. కానీ మాజీ సీఎం జగన్.. ఆస్తుల విషయంలో తల్లి, చెల్లిని రోడ్డు కీడ్చారంటూ విమర్శలు గుర్పించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా ఆయనలో ఇంకా మార్పు రాలేదన్నారు.

Advertisement

అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ అట్లాంటాలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్, జగన్ గురించి మాట్లాడాలంటూ అభిమానులు రిక్వెస్ట్ చేయడంతో నోరు విప్పారాయన.

ఆయన గురించి మాట్లాడటానికి ఏమీ లేదని, ప్రజలే కుర్చీ మడతపెట్టారన్నారు. ఫలితాలు వచ్చినప్పుడు కాస్త భయమేసిందని, ఈ స్థాయిలో వస్తుందని తాము ఊహించలేదన్నారు మంత్రి లోకేష్. సీఎం బాబు అనుకుంటే.. లోపల వేయడానికి రెండు నిముషాలు చాలన్నారు.

Advertisement

ALSO READ:  జంటగా దీపాలు వెలిగించిన దువ్వాడ, మాధురి.. అసలేం చెప్పారంటే?

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆవేదన లేదా? ఎలాంటి తప్పు చేయని వ్యక్తి 52 రోజులు జైలులో ఉన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం కావాల్సింది రివేంజ్ కాదని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే ఆయన లక్ష్యమన్నారు. యువతకు ఉపాధి కల్పించాలన్నారు.

ప్రజలు తమపై బాధ్యత పెట్టారని, వారి ఆశలు వమ్ము చేయమన్నారు. పెట్టుబడులు రప్పించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కచ్చితంగా రెడ్ బుక్‌ని అమలు చేస్తామని చెప్పకనే చెప్పేశారు మంత్రి లోకేష్. ఈ క్రమంలో లెజెండ్‌ మూవీలో బాలకృష్ణ డైలాగ్‌ని గుర్తు చేశారు. తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్ర పుటల్లో ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా ఉంటుందన్నారు.

 

 

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×