BJP Manifesto 2024 update(Today news paper telugu): దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి ఊపందుకుంది. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలు అన్ని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల హామీలను గుమ్మరిస్తున్నాయి. అయితే కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్ కొట్టేందుకు ఇప్పటికే హ్యూహాలు అమలు చేయడం మొదలుపెట్టింది. దీనిలో భాగంగా లోక్ సభ ఎన్నికలకు సంబంధిన మేనిఫెస్టో విడుదలకు బీజేపీ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మరో అధికారం చేజిక్కించుకోవడం కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రోడ్ షోలు, సభలను నిర్వహిస్తున్నారు. ఈ పదేళ్లలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో అధికార బీజేపీ మరోసారి తన మేనిఫెస్టోను విడుదల చేసిన ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నాలు చేస్తోంది. మేనిఫెస్టో విడుదలకు బీజేపీ అధిష్ఠానం ముహూర్తం కూడి ఖరారైనట్లు సమాచారం.
ఆదివారం అంటే ఏప్రిల్ 14వ తేదీన ‘సంకల్ప్ పత్ర’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసేందుకు బీజేపీ సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ‘న్యాయ పత్ర’ పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది.
Also Read: బాంబ్ బ్లాస్ట్ నిందితుల మాస్టర్ ప్లాన్స్.. ఎలా తప్పించుకు తిరిగారో చూడండి(VIDEO)
కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీ అధిష్ఠానం ఆదివారం మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితల బీజేపీ పెద్దలు ఈ సంకల్ప పత్రను రిలీజ్ చేయనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.