BigTV English

Dream Job Corporate Perks: అక్కడ ఉద్యోగం చేస్తే.. 480 రోజులు ప్రెగ్నెన్సీ లీవ్, ఐఫోన్, ల్యాప్ టాప్, జిమ్ భోజనం ఫ్రీ, జాబ్ ఇన్సూరెన్స్!

Dream Job Corporate Perks: అక్కడ ఉద్యోగం చేస్తే.. 480 రోజులు ప్రెగ్నెన్సీ లీవ్, ఐఫోన్, ల్యాప్ టాప్, జిమ్ భోజనం ఫ్రీ, జాబ్ ఇన్సూరెన్స్!

Dream Job Corporate Perks| ఒక సాఫ్టేవర్ ఉద్యోగి తనకు లభించే జాబ్ ఇన్‌సెంటివ్, కార్పోరేట్ పర్క్స్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది విపరీతంగా వైరల్ అవుతోంది. పోస్ట్ చదివిన నెటిజెన్లు అంతా నోరెళ్ల బెట్టారు. కొందరు ఆశ్చర్యంలో షాకక్ గురైతే, మరికొందరు మాత్రం అసూయ చెందుతున్నారు.


వివరాల్లోకి వెళితే.. ఆషుతోష్ అనే ఒక భారతీయడు సాఫ్టవేర్ డెవలపర్ గా స్విడెన్ దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ దేశంలో ఉద్యోగులకు లభించే సాలరీతో ఇన్‌సెంటివ్స్, కార్పోరేట్ పర్క్స్ గురించి ఇన్‌స్టాగ్రామ్ లో ఇటీవల ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో ఉద్యోగులకు లభించే సెలవులు, ఉద్యోగులు సంతోషంగా ఉండాలని కంపెనీలు ఇచ్చు అలవెన్సుల గురించి అతను షేర్ చేశాడు. అతని వీడియో చూసి ఆన్ లైన్ లో కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి.

అషుతోష్ ప్రకారం.. స్వీడెన్ దేశంలో పని ఉద్యోగులకు ప్రతీ సంవత్సరం 30 రోజుల వెకేషన్ లీవ్ ఉంటుంది. అలాగే చాలా ఆఫీసుల్లో సిబ్బందికి సెలవు త్వరగా ఆమోదిస్తారు. వారు మానసికంగా ఉల్లాసంగా ఉండాలని కుటుంబంతో ఎక్కువ సేపు గడిపేందుకు ఏదైనా పబ్లిక్ హాలిడే ఉంటే అంతకుముందు రోజు హాఫ్ డే ప్రకటిస్తారు. లేదా పని త్వరగా పూర్తి చేసి ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తారు.


అంతేకాదు ఉద్యోగంలో చేరే ప్రతీ కొత్త ఉద్యోగికి ఒక ఐఫోన్, ల్యాప్ టాప్ కి వెల్ కమ్ కిట్ రూపంలో అందిస్తారు. స్విడెన్ దేశంలో మనుషులు మానసిక ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం, అక్కడి సంస్థలు ప్రాధాన్యం ఇస్తాయి. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే అందుకోసం శారీరక ఆరోగ్యం కూడా ముఖ్యం. అందుకే కంపెనీలన్నీ ఉద్యోగులందరికీ సంవత్సరానికి రూ.30000 నుంచి రూ.40000 జిమ్ మెంబర్ షిప్స్ ఇస్తాయి. వీటితో పాటు మసాజ్, వెల్ నెస్ సర్వీసులు కూడా ఉంటాయి. ఒక వేళ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లోనే అన్నీ సెటప్ చేసుకునేందుకు రూ.50,000 అదనంగా అలవెన్స్ ఇస్తారు.

ఈ ఇన్‌సెంటివ్స్‌ల జాబితా అప్పుడే ఆగిపోలేదు. ప్రతి నెలా రూ.10,000 మధ్యాహ్న భోజనం అలవెన్స్ ఇస్తారు. రవాణా సౌకర్యం కోసం కార్లు కావాలంటే డిస్కౌంటెడ్ రేట్లపై కార్లు లీజుకు ఇస్తారు. మహిళా ఉద్యోగికి ప్రెగ్నెన్సీ లీవ్ గా 480 రోజులు సాలరీతో కూడిన లీవ్ ఇస్తారు. పురుషులకు కూడా వారి భార్యలు గర్భవతి ఉంటే ఆరు నెలలపాటు లీవ్ పెట్టుకోవచ్చు.

Also Read: జిమ్ వెళ్లడానికి టైమ్ లేదా? ఇంట్లోనే బరువు తగ్గడానికి ఈజీగా ఇలా చేయండి

అన్నిటి కంటే ముఖ్యంగా ఎవరైనా ఉద్యోగం కోల్పోతే జాబ్ ఇన్‌సూరెన్స్ కింద స్వీడెన్ లోని ఉద్యోగ యూనియన్ వారికి తొమ్మిది నెలల పాటు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. వేసవిలో అయితే ఉద్యోగులకు పనివేళలు తక్కువగా ఉంటాయి.

ఇన్ని వివరాలు చదివి నెటిజెన్లు ఆహా, ఓహా అంటున్నారు. “భారత్ లాంటి దేశాల్లో ఇలాంటి విధానం ఎప్పుడైనా వస్తుందా?” అని ఒకరు ప్రశ్నిస్తే.. “సెలవు తీసుకోవడం ఉద్యోగి హక్కుగా ఉన్నా ఇండియాలో అయితే అంత ఈజీగా ఇవ్వరు. అందుకోసం బాస్ కాళ్ల వేళ్లా పడాలి” అని మరొకరు కామెంట్ చేశాడు. ఇంకొకరైతే.. “స్వీడెన్ లాంటి జాబ్ దొరకడం ఒక డ్రీమ్ జాబ్ అవుతుంది” అని రాశాడు.ఇంకొక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అయితే .. ‘నువ్వు చాలా లక్కీ బ్రో’ అని కామెంట్ పెట్టాడు.

Related News

Viral Video: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Big Stories

×