BigTV English

Liquor offer: ఒక బీరు కొంటే మరొకటి ఫ్రీ.. ఎగబడ్డ జనాలు, ఎక్కడంటే?

Liquor offer: ఒక బీరు కొంటే మరొకటి ఫ్రీ.. ఎగబడ్డ జనాలు, ఎక్కడంటే?

Liquor offer: మందుబాబులకు ఇది అసలు సిసలైన పండుగనే చెప్పవచ్చు. మన దేశంలోని ఆ రాష్ట్రంలో కొన్ని వైన్ షాపుల్లో ఓ టాటిక్ కొంటే మరో బాటిల్ ఫ్రీ.. అలాగే ఫుల్ బాటిల్ తీసుకుంటే దానిపై రూ.200 డిస్కౌంట్ కూడా ప్రకటించారు. అయితే ఇది రాష్ట్రంలో ఏ ఒక్కటో.. రెండో.. వైన్ షాపులకు పరిమితి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ బంపర్ ఆఫర్ నడుస్తోంది. ఇక మందుబాబులు ఊరుకుంటారా..? ఛలో పరుగెత్తడమే తక్కువ.. ఆఫర్ విషయం తెలియగానే నిమిషాల్లో ఆ మద్యం దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


యూపీలోని పలు జిల్లాల్లో మందుపై ఆఫర్లు అందిస్తున్నారు. అంతే కాదు.. భారీ డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. నిన్న నోయిడాలోని ఓ వైన్ షాపులో ఓ బాటిల్ కొంటే మరొ బాటిల్ ఫ్రీ అనే ఆఫర్ పెట్టడంతో  తాగుబోతు బ్యాచ్ అంతా భారీ సంఖ్యలో క్యూకట్టింది. అయితే ఈ ఆఫర్ నోయిడాలోనే కాదు.. యూపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మందుపై డిస్కౌంట్లు, ఆఫర్లు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఒక బాటిల్ తీసుకుంటే.. చేస్తే మరొక బాటిల్‌,  మరికొన్ని చోట్ల ఫుల్ బాటిల్ తీసుకుంటే రూ. 200 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.

నిన్న నోయిడా సెక్టార్ 18లోని ఓ షాపు ముందు ‘ఒక బాటిల్ కొంటే ఒకటి ఉచితం’ అనే ఆఫర్ ప్రకటించారు. ఆ వెంటనే మందు బాబులు నిమిషాల్లో పరిగెత్తుకుంటే వచ్చి షాపు ముందు బారులు తీరారు.  దీంతో అక్కడ ఏదో చిన్నపాటి జాతర జరుగుతున్నలాంటి దృశ్యాలు కనిపించాయి . కొందరు క్యూలో నిలుచుని ఎప్పుడెప్పుడు మందు చేతికి వస్తుందో అని ఎదురుచూస్తుంటే.. మరికొందరు అయితే ఇతరులతో గొడవకు దిగారు. ఇలా వందల సంఖ్యంలో మందు కొనేందుకు బారులు తీరారు. అక్కడున్న మందు బాబులకు మద్యం బాటిల్‌ దొరకగానే ఏదో జాక్‌పాట్‌ తగిలినట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి సంతోషానికి అవధులు లేకుండా పోయిందనే చెప్పవచ్చు.


అలాగే రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లాలో వైన్ షాపుల్లో కూడా భారీ ఆఫర్లు ప్రకటించారు. దీంతో ఆ షాపుల ముందు కూడా మందుబాబులు భారీగా క్యూ కట్టారు. అయితే, భారీగా నిల్వవున్న మద్యం బాటిళ్లను ఖాళీ చేసేందుకే ఇక్కడి వైన్ షాపుల్లో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ముజఫర్ నగర్‌లోని ఓ వైన్ షాపు ముందు మందు కొనుగోలుకు వేచిచూస్తున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ఒక బాటిల్ కొనుగోలుకు మరొక బాటిల్‌ ఉచితం అనే ఆఫర్‌ పెట్టడంతో విపరీతంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని అన్నాడు. అందు కోసమే జనాలు విపరీతంగా తరలివస్తున్నారని చెప్పాడు.

రాష్ట్రంలో మందు స్టాకు అమ్మేందుకు మార్చి 25న లాస్ట్ డేట్. అయితే మద్యం కాంట్రాక్టర్లు మరో ఐదు రోజుల గడువు అడిగి.. ఆఫర్లు, భారీగా డిస్కౌంట్లు అందిస్తూ జోరుగా మద్యం అ‍మ్మకాలు జరుపుతున్నారు. యూపీలో ఇటీవల ఈ-లాటరీ ద్వారా కొత్తగా వైన్ షాపులను కేటాయించారు. ఈ క్రమంలోనే వైన్ షాపు నిర్వాహకులు ఈ-లాటరీలో దుకాణాలను దక్కించుకోలేకపోయారు. మరోవైపు మార్చి 31 న ఓల్డ్ షాపుల్లో స్టాక్‌ను పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా మద్యం దుకాణాల్లో భారీ ఆఫర్లు కొనసాగుతున్నాయి.

అయితే, మద్యం దుకాణాలకు ప్రస్తుతమున్న పని వేళలు మారలేదని.. దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని.. ఇది చాలా ఏళ్లుగా అమలులో ఉన్న 12 గంటల పరిమితి అని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి నితిన్ అగర్వాల్ తెలిపారు.

ALSO READ: BANK OF BARODA: భయ్యా ఈ జాబ్ గిట్ల వస్తే జీతం రూ.28,00,000.. డిగ్రీ పాసైతే మీరు అప్లై చేసుకోవచ్చు..

 

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×