Cindyana Santangelo: సినీ పరిశ్రమలో, మోడలింగ్ ఇండస్ట్రీలో చూడడానికి అందంగా కనిపించడం కోసం, ట్రెండీగా కనిపించడం కోసం రకరకాల సర్జరీలు చేసుకుంటారు. మెడిసిన్స్ ఉపయోగిస్తుంటారు. వాటి వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలిసి కూడా చాలావరకు నటీమణులు ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధమవుతారు. తాజాగా ఓ హాలీవుడ్ నటి అనుమానస్పదంగా మృతిచెందగా తన మరణానికి కూడా ఇలాంటి సర్జరీలే కారణమని ప్రేక్షకులు అనుమానిస్తున్నారు. ఆ నటి మరెవరో కాదు.. సిండ్యానా సాంటాంజెలో. తను నటి మాత్రమే కాదు.. పాప్ సింగర్, డ్యాన్సర్ కూడా. తన కెరీర్‌లో ఎన్నో ఘనతలను సాధించిన సిండ్యానా మరణ వార్త తన ఫ్యాన్స్‌ను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
అప్పటికే మరణించింది
సిండ్యానా సాంటాంజెలో నటిగా ‘మ్యారిడ్ విత్ చిల్డ్రెన్’, ‘ఏఆర్’ వంటి సినిమాల్లో కనిపించినందుకు తనకు ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రివ్యూలు అందాయి. అలాంటి నటి తన 58వ ఏట కన్నుమూసింది. లాస్ ఏంజెల్స్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్ తెలిపిన సమాచారం ప్రకారం.. మాలిబూలోని ఎమర్జెన్సీ సర్వీసులకు సోమవారం రాత్రి దాదాపు 7 గంటల 15 నిమిషాల సమయంలో ఒక కాల్ వచ్చింది. ఆ తర్వాత సిండ్యానాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికే తను మరణించిందని వైద్యులు నిర్ధారించారు. సిండ్యానా ఇటీవల ఇంట్లోనే కాస్మటిక్ షాట్స్ తీసుకుందని అధికారులు చెప్తున్నారు. అదే చావుకు కారణమని అనుమానిస్తున్నారు.
ఏంటి కారణం.?
సిండ్యానా సాంటాంజెలో (Cindyana Santangelo) ఇంట్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని, అందుకే అసలు తన చావుకు కారణమేంటో కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. 1989లో సిండ్యానా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘బస్ట్ ఏ మూవ్’ అనే మ్యూజిక్ వీడియోలో కనిపించడం ద్వారా మొదటిసారి తన లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఆ తర్వాత తనే సింగర్‌గా మారి ‘స్టాప్’ అనే మ్యూజిక్ వీడియో చేసింది. అలా సింగర్‌గా మ్యూజిక్ వీడియోలు చేస్తున్న సమయంలోనే తనకు టీవీ రంగం నుండి పిలుపు వచ్చింది. మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రెండేళ్లలోనే తనకు వెండితెరపై కూడా ఛాన్స్ వచ్చింది. అలా సిండ్యానా రేంజ్ పెరిగిపోయింది.
Also Read: కోలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ దుర్మార్గం.. నటి 14 నిమిషాల వీడియో లీక్..
ఫ్యామిలీతో క్లోజ్
1990లో విడుదలయిన ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ ఫోర్డ్ ఫెయిర్‌లేన్’ అనే సినిమాతో సిండ్యానా వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత 2003లో విడుదలయిన ‘హోమిసైడ్’ అనే కామెడీ డ్రామాలో కనిపించి అలరించింది. గత నెలలో సిండ్యానా కుమారుడు డాంటే 20వ పుట్టినరోజు సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. దీన్ని బట్టి చూస్తే తను తన ఫ్యామిలీతో కూడా చాలా క్లోజ్ అనే విషయం అర్థమవుతోంది. కానీ ఉన్నట్టుండి సిండ్యానా ఎలా మృతి చెందింది అనే విషయం మాత్రం మిస్టరీగా మారింది. చాలావరకు తను తీసుకున్న కాస్మటిక్ ఇంజెక్షన్స్ వల్లే ఇలా జరిగుంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వగలమని తెలిపారు.