E-Paper
Advertisement

కెప్టెన్ మచ్చర్‌‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. కో-పైలట్ వివరాలు గోప్యంగా ఉంచుతున్న ఏజెన్సీలు

కెప్టెన్ మచ్చర్‌‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. కో-పైలట్ వివరాలు గోప్యంగా ఉంచుతున్న ఏజెన్సీలు
Advertisement

Delhi: ప్లై దుబాయ్ విమానం ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. తన దాడి జరిగినా ఆలోచించకుండా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసిన భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌‌ని ప్రశంసలతో ముంచెత్తారు. తీవ్రంగా గాయపడినప్పటికీ వందలాది మంది ప్రాణాలను కాపాడారని, ఆయన ధైర్యసాహసాలను గుర్తు చేశారు. ఆయన్ని హీరోగా అభివర్ణించారు. స్మిత్‌ను చూసి దేశం యావత్త దేశం గర్విస్తోందన్నారు.

కెప్టెన్ మచ్చర్‌‌పై ప్రధాని మోదీ ప్రశంసలు

ప్లై దుబాయ్ విమానంలో తన ప్రాణాలను ఎదురొడ్డి 180 మందిని ప్రయాణికులకు కాపాడిన పైలట్ స్మిత్ మచ్చర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అనుకోకుండా ప్రమాదం ఎదురైనప్పుడు తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను రక్షించేందుకు కెప్టెన్ స్మిత్ గొప్ప ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఆయన చూపిన తెగువ ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఒక్కమాటలో చెప్పాలంటే పెను విషాదం తప్పింది. మచ్చర్‌ను చూసి యావత్త భారత్‌ గర్విస్తోందని, ఆయన వేగంగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నానని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు ప్రధాని మోదీ.

నిలకడగా కెప్టెన్ ఆరోగ్యం-సౌదీలో భారత్ అధికారులు

Advertisement

తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ సౌదీ అరేబియాలోని ఓ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా తెలిపింది. రియాద్‌, జెడ్డాలోని భారత అధికారులు ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నారని పేర్కొంది. ఆయన ఆరోగ్యంపై పూర్తి సమాచారం అందాల్సి ఉన్నప్పటికీ, ఆయన పరిస్థితి ప్రమాదకరంగా లేనట్లు తెలుస్తోంది. మచ్చర్ కుటుంబ సభ్యులతో అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు.

కో-పైలట్ వివరాలను గోప్యంగా ఉంచుతున్న ఏజెన్సీలు

విమాన ప్రమాదానికి కారణమైన కో-పైలట్ వివరాలను సంబంధిత ఏజెన్సీలు గోప్యంగా ఉంచుతున్నాయి. బుధవారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.31 గంటలకు ఫ్లైట్ FZ1073 ఒక ప్రమాద సంకేతాన్ని పంపింది. నిమిషాల వ్యవధిలోనే విమానం హైజాకింగ్‌కు గురైందని సూచిస్తూ 7500 కోడ్ పంపబడింది. కో-పైలట్.. భారత కెప్టెన్ స్మిత్‌పై కత్తితో దాడి చేశాడు. అతడు తీవ్రంగా గాయపడినప్పటికీ విమానం నియంత్రణను వదులుకోవడానికి నిరాకరించాడు. విమానం వేగంగా కిందకు దిగడం ప్రారంభించింది. కెప్టెన్ స్మిత్ కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులను లోపలికి అనుమతించారు. వారు నిందితుడ్ని అదుపులోకి తీసుకోవడానికి సహకరించారు.

Advertisement

ALSO READ: పహల్గాం నరమేధం సూత్రధారి ఖతం.. హాషీమ్​ మూసా శవం వద్ద డ్యాన్స్ చేసిన జవాన్లు!

ప్రయాణికుల కథనం ప్రకారం.. పైలట్‌ని కత్తితో పొడిచిన తర్వాత విమానం వ్యవస్థలను దెబ్బతీసి, దాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించాడని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. కో-పైలట్ ఒమన్ కి చెందినవాడని సమాచారం. ఘటన తర్వాత విమానంలో విధుల్లో లేని ఇద్దరు పైలట్లు విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

 

Related News

పహల్గాం నరమేధం సూత్రధారి ఖతం.. హాషీమ్​ మూసా శవం వద్ద డ్యాన్స్ చేసిన జవాన్లు!

ఇదెక్కడి విచిత్రం సామీ.. 15 ఏళ్లుగా రాఖీ కట్టిన అన్ననే పెళ్లాడిన చెల్లెలు!

ఇండియన్ కోస్ట్‌గార్డ్ భారీ ఆపరేషన్.. సముద్రంలో రూ.3,000 కోట్ల డ్రగ్ సీజ్.. సినిమా రేంజ్ ఛేజింగ్!

రేషన్‌ కార్డు‌దారులకు బిగ్ అలర్ట్.. కోటిన్నర కార్డులు రద్దు? 6 నెలలుగా రేషన్ తీసుకోకుంటే

జవాన్ల మధ్య అంతర్గత కలహాలు.. నలుగుర్ని కాల్చి చంపిన మరొక జవాన్, జమ్మూకాశ్మీర్‌లో దారుణం

రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

చైనా మీదుగా భారత విమానాలు.. పాక్ ఆంక్షలకు చెక్ పెట్టేలా.. డ్రాగన్‌తో కేంద్రం చర్చలు!

Big Stories

Advertisement
×