Argument between Ruturaj VS Shai Hope: వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య గౌహతి వేదికగా జరిగిన రెండవ వన్డేలో భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. అంతేకాదు ఇదే మ్యాచ్ లో ఇరు జట్ల ప్లేయర్ల మధ్య గొడవలు కూడా చోటు చేసుకున్నాయి. లేటెస్ట్ గా రుతురాజు గైక్వాడ్ ను వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ స్లెడ్జింగ్ చేసినట్లు ఫోటోలు బయటకు వచ్చాయి. విరాట్ కోహ్లీ వికెట్ పడిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రుతురాజ్ ను టార్గెట్ చేశారట వెస్టిండీస్ క్రికెటర్లు. గిల్ వికెట్ పడకపోవడంతో… రుతురాజ్ ను టార్గెట్ చేశాడట వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్. ఇందులో భాగంగానే తన లాగా బౌండరీలు, సిక్సర్లు కొట్టాలని రుతురాజ్ దగ్గరకు వెళ్లి షాయ్ హోప్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డే సందర్భంగా కెప్టెన్ గిల్ డబుల్ సెంచరీ చేశాడు. గిల్ భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. ప్లాన్ మార్చిన వెస్టిండీస్… ఇతర బ్యాటర్ల వికెట్లను తీసే పనిలో పడింది. ఈ క్రమంలోనే సెంచరీ హీరో రోహిత్ శర్మను త్వరగానే అవుట్ చేసిన వెస్టిండీస్… ఆ తర్వాత విరాట్ కోహ్లీని కూడా రెచ్చగొట్టింది. రోహిత్ శర్మ వికెట్ తీసిన జేడెన్ సీల్స్… విరాట్ కోహ్లీని టెంప్ట్ చేశాడు. దీంతో వేగంగా ఆడిన విరాట్ కోహ్లీ జోసెఫ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ ను వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ టార్గెట్ చేశాడు. అతడు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. తనలాగా సిక్సర్లు అలాగే బౌండరీలు కొట్టి… అర్థ సెంచరీ చేసుకో… మ్యాచ్ త్వరగా ఫినిష్ చేసేయ్ అంటూ స్లెడ్జింగ్ చేయడం మొదలు పెట్టాడు. కొన్ని బూతులు కూడా తిట్టినట్లు తెలుస్తోంది. దీనిపై వెంటనే రుతురాజ్ కూడా ఆన్సర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను స్లోగానే ఆడతాను… బంతులు చాలానే ఉన్నాయి, టార్గెట్ చిన్నదిగా ఉందని రుతురాజ్ కౌంటర్ ఇచ్చారట. వెస్టిండీస్ ఆటగాళ్లు ఎంత గెలికినా స్లోగా బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ గెలిపించాడు రుతురాజ్. ఈ మ్యాచ్ లో 31 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
గౌహతి వేదికగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో టీమిండియా విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 405 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని కేవలం 43.3 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది టీమిండియా.