VIRAT KOHLI VS JAYDEN SEALES: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య గౌహతి వేదికగా రెండో వన్డే జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీని వెస్టిండీస్ బౌలర్ జేడెన్ సీల్స్ అనవసరంగా గెలికాడు. చేతనైతే నా బౌలింగ్ లో సిక్సర్లు, బౌండరీలు కొట్టు అంటూ విరాట్ కోహ్లీని రెచ్చగొట్టాడు. అయితే అలా రెచ్చగొట్టిన నేపథ్యంలో వెంటనే విరాట్ కోహ్లీ సీరియస్ కాకుండా.. తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. నువ్వు బౌలింగ్ చేయరా… బౌలింగ్ చెయ్ అని బదులిస్తూ.. అతడి ఓవర్ లో మొత్తం 25 పరుగులు రాబట్టారు. ఈ 25 పరుగులలో గిల్ ప్రాతినిధ్యం కూడా ఉంది. ఇద్దరు కలిసి వెస్టిండీస్ బౌలర్ జేడెన్ సీల్స్ భరతం పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో గిల్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ వెస్టిండీస్ చేసింది. ఈ క్రమంలో ఏడు వికెట్లు నష్టపోయిన వెస్టిండీస్ 405 పరుగులు సాధించింది. వెస్టిండీస్ ప్లేయర్లు ముగ్గురు సెంచరీలు చేశారు. అయితే ఈ లక్ష్యాన్ని టీం ఇండియా 43.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు నష్టపోయి చేదించింది. కెప్టెన్ గిల్ డబుల్ సెంచరీ చేయగా… రోహిత్ శర్మ సెంచరీ తో రెచ్చిపోయాడు దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది టీమిండియా
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్ లోకి వచ్చాడు. విరాట్ కోహ్లీ మొన్న సెంచరీ చేయగా నిన్న… 72 బంతుల్లోనే రోహిత్ శర్మ సెంచరీ చేసి ఇరగదీశాడు. అయితే రోహిత్ శర్మ సెంచరీ చేసిన తర్వాత వికెట్ల ముందు దొరికిపోయాడు. వెస్టిండీస్ బౌలర్ జేడెన్ సీల్స్ అద్భుతమైన బంతి సంధించాడు. ఈ నేపథ్యంలో వికెట్ల ముందు దొరికిపోయిన రోహిత్ శర్మ పెవిలియన్ కు వెళ్లాడు. అయితే రోహిత్ శర్మ సెంచరీ చేసిన తర్వాత డాన్సింగ్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇక హిట్ మ్యాన్ వికెట్ తీసిన అనంతరం సీల్స్ కూడా అదే తరహాలో సెలబ్రేషన్స్ చేసుకొని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.