Pahalgam Attack: పహల్గాం నరమేధంలో కీలకంగా ఉన్న లష్కర్ ఏ తొయిబా ఉగ్రవాది హాషీమ్ ఫౌజీ అలియాస్ హాషీమ్ మూసా (Hashim Musa)ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మోస్ట్ వాంటెడ్ గా ఉన్న మూసా ఎన్ కౌంటర్ లో చనిపోవటంతో ఆర్మీ జవాన్లు ఆనందంతో డ్యాన్సులు చేశారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గతేడాది ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో పర్యాటకులపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘాతుకంలో 26 మంది పర్యాటకులు మృత్యువాత పడ్డారు. అప్పట్లో ఈ నరమేధం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్ లోని పలు ఉగ్రవాదుల అడ్డాలను ధ్వంసం చేసింది. మన వాయుసేన జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారు.
అయితే పహల్గాం నరమేధంలో నిందితునిగా ఉన్న మూసా మాత్రం ఈ దాడుల్లో మరణించలేదు. ఈ క్రమంలో అతని ఆచూకీ తెలుసుకోవటానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం రూ.20 లక్షల రివార్డును సైతం ప్రకటించింది. ఈ క్రమంలోనే కాశ్మీర్ లోని బుద్గామ్ జిల్లా యూస్ మార్గ్ అటవీ ప్రాంతంలో అతడు ఉన్నట్టుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. వెంటనే నిఘా వర్గాలు ఆర్మీ అధికారులను అలర్ట్ చేశారు.
Also Read: కాంగ్రెస్‌పై తిరుగుబాటు ఖాయం.. కేసీఆర్ మళ్లీ సీఎంగా రాబోతున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆర్మీ జవాన్లు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. మూసా కోసం యూస్ మార్గ్ ప్రాంతంలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. వీరిని చూసిన మూసా అతని సహచరులు కాల్పులకు తెగబడ్డారు. దాంతో ఆర్మీ జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. దీంట్లో మూసా చనిపోయాడు. అతని మృతదేహంతోపాటు ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మూసా గతంలో పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో పారా కమాండోగా పని చేసినట్టు భద్రతా వర్గాలు వెల్లడించాయి.
Also Read: USB 2.0 vs USB 3.0.. రెండింటి మధ్య తేడాలేంటి? మీ అవసరాలకు ఏది బెటర్?