Big Stories

Mask Rule : విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధన ఎత్తివేత.. కేంద్రం కీలక నిర్ణయం..

Mask Rule: ఇకపై విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి కాదని కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే విమానాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కేసులు తగ్గుతున్నప్పటికీ మాస్కులు ధరించడమే మంచిదేనని సూచించింది. ప్రయాణికులు మాస్కులు ధరించడం వారి ఇష్టమేనని పౌరవిమానయాన మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

- Advertisement -

కరోనా వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు విమాన ప్రయాణికులు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. ఈ నిబంధనను కఠినంగా అమలు చేశారు. ఇకపై విమానాల్లో మాస్క్ లు ధరించకపోయినా ప్రయాణికులకు ఎలాంటి జరిమానాలు , శిక్షలు ఉండవని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

- Advertisement -

దేశంలో బుధవారం 501 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 7,561 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా కేసుల రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. దీంతో విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధనను కేంద్రం ఎత్తివేసింది. ఇప్పటికే కరోనా విషయంలో దాదాపు అన్ని నిబంధనలను కేంద్రం సడలించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News