Caste Census : కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కులగణన చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్.. 2026 జనగణనతో పాటే కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ హయాంలో ఏనాడూ కులగణన చేయలేదన్నారు కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్. కులగణన చుట్టూ కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ఫైరయ్యారు. కొన్ని రాష్ట్రాలలో రాజకీయ ప్రయోజనాల కోసమే కులగణన చేశారని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో చేసిన సర్వేలకు శాస్త్రీయత లేదన్నారు కేంద్రమంత్రి.
తెలంగాణ బాటలో కేంద్రం
కులగణనపై కేంద్ర తీసుకున్న నిర్ణయం.. కాంగ్రెస్ పార్టీ విజయమే అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణను దేశం ఫాలో అయిందన్నారు. రాహుల్ గాంధీ విజన్‌కు.. కేంద్రం తలవంచిందని చెప్పారు. తెలంగాణలోనే తొలిసారిగా పూర్తిస్థాయి సామాజిక, ఆర్థిక, కుల గణాంకాలు చేపట్టామని సీఎం రేవంత్ తెలిపారు. అసెంబ్లీలో కులగణన నివేదిక ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేశామని గుర్తు చేశారు. తెలంగాణలో 56.32 శాతం బీసీలు ఉన్నట్టు కులగణనలో తేలిందని.. అందుకు అనుగుణంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదన చేసి దిశానిర్దేశం చేశామని చెప్పారు. కులగణనను తెలంగాణ సర్కారు చేపడితే.. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణను అనుసరిస్తోందన్నారు ముఖ్యమంత్రి. జంతర్ మంతర్ దగ్గర బీసీ గణాంకాల కోసం తెలంగాణ కాంగ్రెస్ పోరాటం చేసిందని గుర్తు చేశారు. జనగణనతో పాటు కులగణన చేపట్టాలనే కేంద్ర నిర్ణయంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి , కేంద్ర కేబినెట్‌కు అభినందనలు తెలిపారు. ఇది రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర ఘన విజయం అన్నారు.
Based on the vision and direction of
Shri @RahulGandhi Ji who first demanded a nation-wide Caste Census during his historic #BharatJodoYatra Telangana is the first State to conduct caste survey last year.This was the first in Independent #India, the last one being in 1931 by… pic.twitter.com/7dNABdwqM7
— Revanth Reddy (@revanth_anumula) April 30, 2025
తెలంగాణ ఘనతే..
జనాభా లెక్కల్లో భాగంగా కులగణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం కాంగ్రెస్ పార్టీ విజయమే అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కులగణనతో తెలంగాణలో ఏ కులం వారు ఎంత నిష్పత్తిలో ఉన్నారని తేల్చి చెప్పిన తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు. రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం నిర్ణయం తీసుకొని.. పారదర్శకంగా కులగణన సర్వే నిర్వహించారని కొనియాడారు. దేశ చరిత్రలో మొదటిసారిగా కులగణన చేసిన ఘతన తెలంగాణదే అన్నారు. కులగణన చేపట్టాలనే రాహుల్ గాంధీ దీర్ఘకాలికంగా డిమాండ్‌కు.. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గిందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ నిర్వహించిన కులగణనను ఇంతకాలం అపహాస్యం చేసిన బీజేపీ.. ఇప్పుడు మన దారిలోకి రావడం సంతోషకరమన్నారు టీపీసీసీ చీఫ్.