BigTV English

PM Kisan scheme: పీఎం కిసాన్ స్కీమ్.. రైతులకు షాక్ తప్పదా? లేకుంటే ఆ పని తప్పదు

PM Kisan scheme: పీఎం కిసాన్ స్కీమ్.. రైతులకు షాక్ తప్పదా?  లేకుంటే ఆ పని తప్పదు

PM Kisan scheme:  రైతులు ఇకపై అలర్ట్.. తేడా వస్తే పీఎం కిసాన్‌ స్కీమ్ కు సంబంధించి నిధులు రావు. ఈ విషయంలో ఎలాంటి అశ్రద్ధ చేయవద్దు. ఇంతకీ అసలు విషయం ఏంటి? ఈ స్కీమ్ కింద ఏటా రూ.6,000 పొందుతున్న రైతులు అప్రమత్తం కావాలి. జూన్‌లో రానున్న పీఎం కిసాన్ డబ్బులు కచ్చితంగా రావాలంటే ఆ రెండింటిని పూర్తి చేయాలి.


ఏంటి ఆ కండీషన్లు? కేవైసీ పూర్తి చేయాలి. ఒకవేళ గత ఫిబ్రవరిలో పీఎం కిసాన్ నిధులు వస్తే కేవైసీ ఓకే అయినట్టే. ఇక మరొకటి ప్రతీ రైతు విశిష్ట గుర్తింపు కార్డు కలిగి వుండాలి. అది లేకుంటే పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్‌లో పడే ఛాన్స్ లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతీ రైతు విశిష్ట గుర్తింపు కార్డు లేదా యూనిక్ ఐడెంటిఫికేషన్ కార్డు ఉండాలి. కేవలం రైతులకు సంబంధించినది మాత్రమే.

ఈ కార్డు ఉంటేనే పీఎం కిసాన్ సమ్మాన్ స్కీమ్ కింద డబ్బు ఇస్తారు. ఈ కార్డు లేకుంటే రైతులకు పెట్టుబడి సాయం రాదు. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఈ కొత్త కండీషన్ అమలు చేస్తోంది కేంద్రం. జూన్ నెలలో డబ్బు మన అకౌంట్‌లో జమ కావాలంటే ఈ కార్డు తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే 11 అంకెల ఐడీ కార్డు. ఏటీఎం లేదా ఆధార్ కార్డు మాదిరిగా ఉంటుంది.


రైతుల భూమి, పంటల వివరాలు ఈ కార్డు ద్వారా ప్రభుత్వానికి తెలుస్తాయి. ఈ కార్డు వల్ల రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం, ఉద్యానవన పంటలకు రాయితీ ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. రైతుల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తారు అధికారులు. పథకాలు పక్కాగా అమలు కావాలంటే గుర్తింపు కార్డును తప్పనిసరి చేసింది కేంద్రం.

ALSO READ: స్వర్ణ దేవాలయంపై పాక్ కుట్ర.. ఆర్మీ కీలక విషయాలు వెల్లడి

విశిష్ట గుర్తింపు కార్డు వల్ల రైతులకు ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. తుపాన్లు, వరదలు వచ్చినప్పుడు పంట నష్టం జరిగినప్పుడు ఈ కార్డు ద్వారా పరిహారం పొందవచ్చు. రైతు ఏ పంట వేశారు? అనేది ఈ కార్డు ద్వారా ప్రభుత్వానికి తెలుస్తోంది. దానివల్ల వెంటనే పరిహారం ఇవ్వగలవు. భవిష్యత్తులో ఏ పథకం అమలు చెయ్యాలన్నా ఈ కార్డు సమాచారాన్ని లెక్కలోకి తీసుకుంటారు.

విశిష్ట గుర్తింపు కార్డు పొందాలంటే రైతులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు(సెల్‌ఫోన్) తో వ్యవసాయశాఖ ఆఫీసుకు వెళ్లాలి. అక్కడ అధికారులు ఈ ప్రక్రియ చేపడతారు. అప్పుడు రైతు ఫోన్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని వ్యవసాయ శాఖ అధికారికి తెలియజేయాలి. అప్పుడు విశిష్ట గుర్తింపు సంఖ్య క్రియేట్ అవుతుంది. ఆ సంఖ్యను ఒక చోట భద్రంగా ఉంచుకోవాలని లేదంటే రాసుకోవాలి.

ఎప్పుడైనా అధికారులు ఈ సంఖ్యను అడిగితే చెప్పాల్సి వుంటుంది. ప్రస్తుతానికి వ్యవసాయ కార్యాలయాల్లో విశిష్ట గుర్తింపు కార్డు నమోదు ప్రక్రియ జరుగుతోంది. విశిష్ట గుర్తింపు కార్డును ఆధార్‌తో లింక్ చేస్తారు. ఆ తర్వాత రైతుకి శాశ్వతంగా ఐడీగా క్రియేట్ అవుతుంది. జూన్‌లో పీఎం కిసాన్ డబ్బులు తప్పకుండా కేంద్రం ఇస్తుంది. కాకపోతే దీనికి సంబంధించి తేదీ వెల్లడించలేదు.

రైతులు వీలైనంత త్వరగా విశిష్ట గుర్తింపు కార్డు తెచ్చుకోవడం మంచింది. జూన్ స్కీమ్ మనీ రావడానికి కేవలం 11 రోజులు సమయం ఉంది. ఈ పని పూర్తి కాకపోతే పీఎం కిసాన్ డబ్బు రాకపోవచ్చు. విశిష్ట గుర్తింపు కార్డు ఎంత త్వరగా ఇది చేసుకుంటే అంత మంచిది.

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×