E-Paper
Advertisement

అధికారికి ఒక్క వాహనం.. రెండో వాహనానికి నో ఛాన్స్, కేంద్రం కొత్త రూల్స్

అధికారికి ఒక్క వాహనం.. రెండో వాహనానికి నో ఛాన్స్, కేంద్రం కొత్త రూల్స్
Advertisement

Delhi: వృథా ఖర్చులకు కళ్లెం వేసే దిశగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ఒక అధికారికి ఒకే ప్రభుత్వ వాహనాన్ని కేటాయించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యయ విభాగం మెమొరాండం జారీ చేసింది. దీనిపై అప్పుడే పైస్థాయి అధికారుల్లో చర్చ మొదలైంది.

అధికారికి ఒక్క వాహనం- కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకునే పనిలో పడింది. ఇప్పటికే ప్రధానితోపాటు మంత్రులు సైతం తమ కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. ఇప్పుడు అధికారుల వంతైంది. ఒక్క అధికారికి ఒక్క వాహనం మాత్రమే. రెండో వాహనానికి నో ఛాన్స్. ఈ మేరకు కేంద్ర ఆర్థిక వ్యయ విభాగం ఆదేశాలు ఇచ్చేసింది. తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ వాహన సదుపాయం పొందుతున్న అధికారులకు మరొక మంత్రిత్వ శాఖలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నా రెండో వాహనాన్ని ఉండకూడదని తేల్చి చెప్పింది.

Advertisement

రెండో వాహనానికి నో ఛాన్స్-సదరు అధికారి వద్దనున్న వాహనాన్ని అదనపు బాధ్యతల నిర్వహణకు ఉపయోగించుకోవాలని ఆదేశాల్లో ప్రస్తావించింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులకు నో చెప్పేసింది. ఈ మేరకు అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఆదేశించడం జరిగిపోయింది. వాహనాల సంఖ్యకే ఈ నిబంధనలు పరిమితం కాలేదు. ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి- పాక్షిక ప్రభుత్వ సంస్థలకు చెందిన వాహనాలను అధికారులు వినియోగించడాన్ని నిషేధించింది కేంద్రం.

చిన్న మినహాయింపు-అధికారిక పర్యటనలు లేకుంటే విధుల్లో భాగంగా ప్రయాణించేటప్పుడు మాత్రమే చిన్నపాటి మినహాయింపు ఇచ్చింది. ఇలాంటి చర్యల వల్ల వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడం, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణను మెరుగు పరచడం దీని ఉద్దేశమని తెలిపింది. వినియోగంలో లేని మిగతా వాహనాలను అనధికారిక పనులకు వాడకుండా వాటిని సురక్షితంగా ఉంచాలని ఆయా శాఖలకు సూచించింది. పన్ను చెల్లింపు దారుల సొమ్మును బాధ్యతగా ఖర్చు చేయడం తమ లక్ష్యమని తెలియజేసింది. నాలుగేళ్ల కింద ప్రభుత్వ వాహనాల వినియోగంపై జారీ చేసిన సమగ్ర మార్గదర్శకాలకు అనుబంధంగా కొత్త ఆదేశాలు వచ్చాయి. కేంద్రం తీసుకొచ్చిన కొత్త విధానంపై పైస్థాయి అధికారుల్లో అప్పుడే చర్చ మొదలైంది. ఇప్పుడే ఈ విధంగా రానున్న రోజుల్లో ఇంకెన్ని మార్పులు వస్తాయోనని చర్చించుకుంటున్నారు.

Advertisement

ALSO READ: రష్యన్ క్షిపణుల దాడి.. బ్లాక్ సీలో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు!

Related News

గుజరాత్‌లో తాగునీటి సంక్షోభం.. మోదీ జల్ జీవన్ మిషన్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!

జైల్లోనూ మారని బుద్ధి.. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో పదుల సంఖ్యలో పో*ర్న్ వీడియోలు!

15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్..

జిన్ పింగ్ రాకకు ముందు.. చైనా రాయబారి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

UPSCలో జాబ్స్.. కేంద్ర ప్రభుత్వంలో 212 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

ఆత్మీయ కౌగిలి.. తిరుక్కురళ్ కానుక.. భారత్ – రష్యా బంధంలో మరో కీలక ఘట్టం!

5G సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!

దేశంలో ఘోరం.. భార్య, ముగ్గురు కూతుళ్లను.. రాయితో కొట్టిచంపిన కిరాతకుడు!

Big Stories

Advertisement
×