CJI Surya Kant: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీతోపాటు వేర్వేరు పార్టీలకు చెందిన నాయకుల బృందాన్ని కలవటానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరాకరించారు. ఈ విషయంలో గోప్యత పాటించాల్సి ఉందన్నారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు లేవెనెత్తిన అంశాలు కోర్టు పరిధిలో విచారణలో ఉన్న నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.
ఓటు చోరీ, ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, ఎస్ఐఆర్ నిలిపివేత, బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి అమల్లోకి తీసుకు రావాలన్న డిమాండ్లతో లోక్ సభ, రాజ్యసభల ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతోపాటు మరికొందరు సమయం కోరుతూ ఆదివారం ఛీఫ్ జస్టిస్ కు ఈ మెయిల్ ద్వారా లేఖ రాశారు. అయితే, వారిని కలవటానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నిరాకరించారు. జాతీయ మానవ హక్కుల సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయనను కలవకపోవటానికి కారణాలు చెప్పాలని ఓ జాతీయ మీడియా సంస్థ ప్రతినిధి అడుగగా ఆ లేఖలోని అంశాల గురించి రాహుల్ గాంధీని అడగాలన్నారు. తాను మాత్రం ఈ విషయంలో గోప్యతను పాటిస్తానని చెప్పారు.
చట్టసభల ప్రతినిధులు తమ ఆందోళలను ఎలా ముందుకు తీసుకెళ్లాలని ప్రశ్నించగా సుప్రీం కోర్టు తలుపులు ఎల్లప్పుడూ అందరి కోసం తెరిచే ఉంటాయన్నారు. సామాన్య పౌరుడైనా.. ప్రజా ప్రతినిధి అయినా పిటిషన్ ద్వారా కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. వారి సమస్యలను చట్టానికి లోబడి విచారించి తగు న్యాయం అందిస్తామన్నారు. అటు ఢిల్లీలోని ప్రస్తుత పరిస్థితులపై స్పందించటానికి సీజేఐ నిరాకరించారు. అది శాంతిభద్రతలకు సంబంధించిన అంశమన్నారు.
Also Read: ఫార్ములా-ఈ రేస్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్!
మరోవైపు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వన్ నేషన్.. వన్ ఎలక్షన్ సుప్రీం కోర్టు పర్యటన రద్దు కావటంపై స్పందిస్తూ ఈ అంశంలో కోర్టులో పరస్పర ప్రయోజనాల ఘర్షణ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో న్యాయమూర్తులందరూ కలిసి పరిపాలనా పరంగా చర్చించి పర్యటన జరపొద్దని సమిష్టిగా నిర్ణయం తీసుకున్నామన్నారు.
Also Read: అందరినీ నవ్వించిన కమెడియన్‌కు ఇంత కష్టమా? రామచంద్ర పరిస్థితి చూస్తే కన్నీళ్లే!