Shadab Khan On Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా పాక్ ఆల్ రౌండర్ షాబాద్ ఖాన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఒరేయ్ పంజాబీ అంటూ విరాట్ కోహ్లీ నన్ను అవమానించాడని బాంబ్ పేల్చాడు. ముఖం పరిచయం లేకపోయినా, తొలిసారి కలువగానే క్లోజ్ అయిపోయాడని వివరించారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా డ్రెస్సింగ్ రూంలో జరిగిన సంఘటన గురించి పాక్ ఆల్ రౌండర్ షాబాద్ ఖాన్ పంచుకున్నాడు. విరాట్ కోహ్లీ పెద్ద పోటుగాడు అనుకున్నా, కానీ అందరిలాగా సాధారణ మనిషే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీవీల్లో విరాట్ కోహ్లీని చూసి..చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడిని అంటూ తెలిపారు. కానీ, నేరుగా డ్రెస్సింగ్ రూంలోనే విరాట్ కోహ్లీ చూసి.. వింతంగా ఫీల్ అయినట్టు పేర్కొన్నాడు. అంతేకాదు, విరాట్ కోహ్లీతో తాను పంజాబీలోనే మాట్లాడానని వెల్లడించారు. దీంతో తనతో కూడా అదే భాషలో మాట్లాడి, నాకు షాక్ ఇచ్చాడన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరం ఎక్కడ కలిసినా, పంజాబీ భాషలోనే మాట్లాడుకుంటున్నామని చెప్పుకొచ్చారు. దీంతో విరాట్ కోహ్లీపై పాక్ ఆల్ రౌండర్ షాబాద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
విరాట్ కోహ్లీని టీవీలో చూసి.. పెద్ద తోపు, తురుము, పొగరెక్కువ అనుకున్నాను, కానీ అతడు మంచి మనసు కలిగిన వాడని షాబాద్ ఖాన్ వెల్లడించారు. మ్యాచ్ లో దూకుడుగా కనిపించే విరాట్ కోహ్లీ, బయట మాత్రం సాఫ్ట్ గా ఉంటారని ప్రశంసలు కురిపించారు. అందరూ అనుకుంటున్నట్టు కోపిష్టి కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు వచ్చిన పంజాబీలోనే మాట్లాడి, గౌరవం ఇచ్చాడన్నారు. 2017లోనే విరాట్ కోహ్లీ ఉన్నత శ్రేణి క్రికెట్ ఆడాడని, అలాంటి స్థానంలో ఉండి కూడా తనతో సరదగా మాట్లాడినట్టు గుర్తు చేశారు. ప్లేయర్లతో సరదాగా గడుపుతాడని, అతను టీమిండియాలో ఉండటం వాళ్ల అదృష్టమని గుర్తు చేశారు.
2027 వన్డే వరల్డ్ కప్ టీమిండియా ఓడిస్తామని పాక్ ఆల్ రౌండర్ షాబాద్ ఖాన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ దిశగా తాము అడుగులు వేస్తున్నట్టు వెల్లడించారు. మరో ఏడాది సమయంలో ఉన్న తరుణంలో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నట్టు తెలిపారు. ఈ సారి మాత్రం గురి తప్పబోదని స్పష్టం చేశారు. కచ్చితంగా టీమిండియాను ఓడిస్తామని ప్రకటించారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని తెలిపారు. టీమిండియాను ఓడించి, ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశారు. దీంతో షాబాద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.