CJP Protest In Delhi: సీజేపీ నిరసనలతో ఢిల్లీ వీధులు రణరంగంగా మారుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు విడుదల చేయకపోవడంతో ఆదివారం నిరసనలు కంటిన్యూ చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్దకు రావాలని మద్దతుదారులకు పిలుపు ఇచ్చారు. సీజేపీ పిలుపుతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ వచ్చే పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
ఎన్నిక ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బొద్దింక జనతా పార్టీ ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు కంటిన్యూ చేయనుంది. శనివారం వేలాది మంది మద్దతుదారులను అడ్డుకున్న పోలీసులు, సుమారు 7 వేల మందిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో భారీగా బలగాలను మోహరించడంతో నిరసనకారులు జంతర్ మంతర్‌కు చేరుకోలేకపోయారు. అయినప్పటికీ నిరసనకారులు చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి సుమారు 22 ప్రదేశాల్లో నినాదాలు చేపట్టారు.
జనతా పార్టీ కన్వీనర్లు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా పోలీసుల అదుపులో ఉండడంతో అజింక్య షిండే నిరసనలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆదివారం నిరసనలు కంటిన్యూ అవుతాయని ఆయన ప్రకటించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. అదుపులో ఉన్న తమ కీలక నాయకులను వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు సీజేపీ ఇన్‌చార్జి అజింక్య షిండే లేఖ రాశారు. న్యాయవాదులు వారిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రస్తావించారు.
శనివారం రాత్రి పొద్దుపోయాక నిరసనకారులను విడుదల చేశారు పోలీసులు. కానీ అభిజీత్ దీపక్, సౌరవ్ దాస్, అశుతోష్ రాంగా, యూట్యూబర్ ధ్రువ్ రాథీ పోలీసుల అదుపులోనే ఉన్నారు. మరోవైపు ఆదివారం ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్‌వద్దకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సీఈసీ రాజీనామా చేసే వరకూ డిల్లీని వీడబోమని స్పష్టంచేశారు. అయితే నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇందులో భాగంగా జంతర్ మంతర్‌ను మూసివేశారు. రాజధాని సరిహద్దుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. 30 పాయింట్ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.
ALSO READ: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, తగలబడిన ఇళ్లు- దుకాణాలు, తొమ్మిది మంది మృతి
శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిరసనకారులు ఉల్లంఘించారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. జూన్-జూలై నిరసనల సమయంలో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో సీజేపీ విఫలమైందని పేర్కొన్నారు. భద్రతా ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ మెట్రో, రైలు సేవలపై ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నారు అధికారులు.
VIDEO | Tamil Nadu: Heavy security deployed near Chennai airport ahead of PM Modi's arrival.
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) pic.twitter.com/QTguTJha6q
— Press Trust of India (@PTI_News) October 11, 2026
Delhi: Security personnel remain deployed at Jantar Mantar today following the CJP's announcement of a protest after mass detentions during yesterday's march pic.twitter.com/HIjFcc4KqP
— IANS (@ians_india) October 11, 2026
#WATCH | Delhi: Security has been heightened outside Delhi Cantt Police Station, where CJP leader Abhijeet Dipke, Ashutosh Ranka, and Saurav Das will be produced before the Executive Magistrate. pic.twitter.com/3Ws7Ctklvd
— ANI (@ANI) October 11, 2026