Stray Dog vs Leopard: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఒక వీధి కుక్క, చిరుత పులితోనే పోరాడింది. అంతేకాదు ఆ చిరుతను దాదాపు 300 మీటర్ల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యం అక్కడి గ్రామస్తుల కళ్లముందే జరిగింది. ఆ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలు ఏం జరిగింది..
నిఫాద్ ప్రాంతంలో రాత్రి చిరుత గ్రామంలోకి చేరుకుంది. అనుకోని విధంగా వీధి కుక్క దానిపై దాడి చేసింది. ఈదాడిలో కుక్క తిరిగి మళ్లీ పులిపైనే దాడికి దిగింది. తన నోటితో ఒక్కసారిగా చిరుత గొంతుని గట్టిగా పట్టేసి, తన అదుపులోకి తెచ్చుకుంది. భయపడకుండా కుక్క కసిగా పట్టేసి లాగడం మొదలుపెట్టింది. చిరుతను దాదాపు 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. అసలు ఈ దాడిని ఊహించని చిరుత చివరికి తనను తాను విడిపించుకుని సమీప పొలాల వైపు పరుగులు పెట్టింది. అయితే ఈ ఘర్షణలో గ్రామస్తులు ఎవరూ గాయపడలేదు. కుక్క మాత్రం పులి దాడి నుంచి బయటపడింది.
Also Read: Bank Holidays: కస్టమర్లకు హెచ్చరిక! నాలుగు రోజులు బ్యాంకు సెలవులు
చిరుత గాయపడిందా? దానికి వైద్య సహాయం అవసరమైందా? అనే విషయాలు మాత్రం ఇంకా స్పష్టంగా లేవు. అటవీ శాఖ మాత్రం ప్రజలు, పశువులు సురక్షితంగానే ఉన్నారని వెల్లడించింది. ఈ సంఘటన కుక్క ధైర్యం వల్లే కాకుండా, దేశంలో వీధి కుక్కలపై జరుగుతున్న చర్చ కారణంగానూ ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వ్యాక్సిన్ వేసిన వీధి కుక్కలను షెల్టర్లలోనే ఉంచాలని ముందుగా ఇచ్చిన ఆదేశాన్ని జస్టిస్ విక్రం నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం సవరించింది.
అలాంటి ఆంక్షలు చాలా కఠినంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అయితే, ఒకవైపు వీధి కుక్కల ఇబ్బందులు, మరోవైపు చిరుతల దాడులు ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఈ ఘటన వీడియో చూసిన కొందరు జంతు ప్రేమికులు ఆకలితో జంతువులు దాడి చేయడం సహజం. పులి కూడా ఆకలితోనే కుక్కపై దాడికి దిగింది. అది ముందుగా గుర్తించింది కాబట్టే కుక్క తనను తాను రక్షించుకుంది. ఆకలితో వున్న జంతువు దాడి చేస్తే దానిని శిక్షించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు.
Niphad taluka, Nashik district, Maharashtra, a stray dog chased and overpowered a leopard near Gangurde Vasti, dragging it by the mouth for approximately 300 meters before the leopard fled. #leopard #dogs #attack #viralvideo #animals pic.twitter.com/BJWeoS4y52
— NextMinute News (@nextminutenews7) August 22, 2025