Bank Holidays: రిజర్వ్ బ్యాంక్ ప్రతి నెల బ్యాంకుల సెలవులను ఖరారు చేసింది. ఏ రాష్ట్రంలో ఎలాంటి పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయో దానికి అనుగుణంగా బ్యాంకులు మూసివేయనున్నారు. ఆగస్టు 25 నుంచి 31 వరకు వారంలో మొత్తం నాలుగు రోజులు బ్యాంకులు పనిచేయవు. కాబట్టి మీకు అవసరమైన పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది.
Also Read:Kukatpally Murder Case: కూకట్ పల్లి బాలిక హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మైనర్ బాలుడే కారణం
సెలవలు ఎప్పుడంటే..
ఆగస్టు 25న (సోమవారం) శ్రీమంత శంకరదేవ తిరుభవ తిథి సందర్భంగా గౌహతిలో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆగస్టు 27న (బుధవారం) గణేష్ చతుర్థి సందర్భంగా ముంబై, నాగ్‌పూర్, చెన్నై, హైదరాబాద్ సహా అనేక నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఆగస్టు 28న (గురువారం) గణేష్ చతుర్థి రెండవ రోజు, నువాఖై పండుగల కారణంగా భువనేశ్వర్, పనాజీ ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. ఆగస్టు 31న (ఆదివారం) వారాంతం కారణంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
బ్యాంకు శాఖలు మూసివేసినా, ఆన్‌లైన్ సేవలు మాత్రం ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI, ATMల ద్వారా మీరు లావాదేవీలు చేయవచ్చు. కానీ చెక్ క్లియరింగ్, డిమాండ్ డ్రాఫ్ట్ వంటి సేవలు మాత్రం లభించవు. కాబట్టి ముఖ్యమైన పనులు ఉంటే సెలవు దినాల ముందు లేదా తరువాత పూర్తి చేసుకోవడం మంచిదని సూచించింది. అయితే ఈ సెలవులు ప్రతి రాష్ట్రానికి ఒకేలా వర్తించవు. స్థానిక పండుగలు, వేడుకలకు అనుగుణంగా మారుతూ ఉంటాయని గమనించగలరు.