Arvind Kejriwal Released From Jail: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ మేరకు బెయిల్ పై విడుదలైన ఆయనకు ఆప్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం కేజ్రీవాల్‌ను పార్టీ కార్యకర్తలు ర్యాలీగా ఊరేగింపు నిర్వహించారు.
నేను నిజాయితీపరుడిని కాబట్టే దేవుడు నాకు మద్దతుగా నిలిచాడని కేజ్రీవాల్ అన్నారు. నన్ను జైల్లో వేస్తే బలహీనపడతానని అనుకున్నారని, కానీ నేను 100 రెట్టు బలపడినట్లు వెల్లడించారు. జైలు గోడలు నన్ను బలహీనపరచలేవన్నారు. దేశానికి నా సేవ కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు.
దేశాన్ని అమ్మే, విచ్చిన్నం చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడతానని కేజ్రీవాల్ వెల్లడించారు. దాదాపు 6 నెలల తర్వాత జైలు నుంచి విడుదల కావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read: ‘ముఖ్యమంత్రి ఆఫీసులో అడుగుపెట్టకూడదు’.. కేజ్రీవాల్ బెయిల్‌కు సుప్రీం షరతులివే!
ఇదిలా ఉండగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఉదయం సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10లక్షల బాండ్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ కేసుపై మాట్లాడొద్దని సుప్రీంకోర్టు సూచించింది.
ట్రయల్ కోర్టు విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ బెయిల్ షరతులే వర్తిస్తాయని సుప్రీంకోర్టు తెలిపింది. సీఎం ఆఫీసు, సెక్రటేరియట్‌కు వెళ్లరాదని ఈడీ బెయిల్‌లో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.