E-Paper
Advertisement

కొనుగోలుదారులకు విన్‌ఫాస్ట్ షాక్.. VF7 ధర భారీగా పెంపు!

కొనుగోలుదారులకు విన్‌ఫాస్ట్ షాక్.. VF7 ధర భారీగా పెంపు!
Advertisement

VinFast VF7 Price Hike: భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి అడుగుపెట్టిన వియత్నాం కంపెనీ విన్‌ఫాస్ట్ అప్పుడే కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. VF7 ఎలక్ట్రిక్ SUV ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వేరియంట్‌ను బట్టి గరిష్ఠంగా రూ.1.13 లక్షల వరకు ధర పెరిగినట్లు తెలిపింది. VF7 ఇప్పుడు భారత మార్కెట్లో రూ.22.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

ఐదు వేరియంట్లలో VF7

విన్‌ఫాస్ట్ VF7 మొత్తం ఐదు వేరియంట్లలో అమ్ముతుంది. వీటిలో ధరల పెంపు రూ.1.10 లక్షల నుంచి రూ.1.13 లక్షల మధ్య ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ధర పెరిగిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ SUV టాప్ వేరియంట్ ధర రూ.28.09 లక్షలకు చేరింది. ధరల మార్పు ఉన్నప్పటికీ, కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్ SUVల విభాగంలో VF7కు ప్రత్యేకమైన స్థానం కల్పించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా బ్యాటరీ కెపాసిటీ, డ్రైవింగ్ రేంజ్, పవర్, ఫీచర్లపై విన్‌ఫాస్ట్ దృష్టి పెట్టింది.

తమిళనాడులోనే అసెంబుల్!

Advertisement

విన్‌ఫాస్ట్ VF7 పూర్తిగా దిగుమతి చేసుకునే మోడల్ కాదు. ఇది CKD విధానంలో భారత్‌కు వస్తుంది. తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న విన్‌ఫాస్ట్ తయారీ ప్లాంట్‌లో వాహనాన్ని అసెంబుల్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 50,000 యూనిట్లుగా ఉంది. భవిష్యత్తులో దీనిని ఏడాదికి 1.5 లక్షల యూనిట్ల వరకు పెంచుకునే అవకాశం ఉంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విస్తరిస్తున్న నేపథ్యంలో స్థానిక ఉత్పత్తిపై కంపెనీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

రెండు డ్రైవ్‌ ట్రెయిన్ ఆప్షన్లు

VF7లో FWD, AWD అనే రెండు డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 70.8 kWh LFP బ్యాటరీతో కూడిన వెర్షన్‌ లో FWD మోటార్ 204hp పవర్, 310Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు AWD వెర్షన్ మరింత పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇది 350hp పవర్, 500Nm టార్క్‌ ను అందిస్తుంది. బేస్ వేరియంట్‌ లో 59.6 kWh బ్యాటరీ ప్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది.

సింగిల్ ఛార్జ్ తో 532 కిలోమీటర్ల రేంజ్

Advertisement

70.8 kWh బ్యాటరీతో కూడిన VF7 ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 532 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.  పనితీరు విషయంలోనూ ఈ SUV ఆకట్టుకుంటుంది. AWD వెర్షన్ కేవలం 5.8 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది.

ఆకట్టుకునే ఫీచర్లు 

VF7లో 12.9 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్ అప్ డిస్‌ప్లే, LED లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు లాంటి ఫీచర్లు ఉన్నాయి. వెనుక సీట్లను రిక్లైన్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. భద్రత పరంగా 7 ఎయిర్‌ బ్యాగ్‌లు, లెవల్ 2 ADAS లాంటి ఫీచర్లు అందించారు. 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా SUV రూపానికి మరింత ఆకర్షణను తీసుకొస్తాయి.

ఆరు రంగుల్లో అందుబాటులో

విన్‌ఫాస్ట్ VF7ను ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది. ఇన్ఫినిటీ బ్లాంక్, క్రిమ్సన్ రెడ్, డెసాట్ సిల్వర్, జెట్ బ్లాక్, అర్బన్ మింట్, జెనిత్ గ్రే కలర్స్ లో కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Read Also:

కొనుగోలుదారులకు టాటా బిగ్ షాక్.. సెప్టెంబర్ 1 నుంచి ధరలు పెంపు!

Tags

Related News

కాంటినెంటల్ GT 650 కొనాలనుకున్నారా? ముందు ఈ 8 విషయాలు తెలుసుకోండి!

ఏప్రిలియా టుయోనో 457 vs స్పెషల్ ఎడిషన్.. రెండింటి మధ్య తేడాలు ఇవే!

కెమెరా లేదు.. వైర్లు లేవు.. డ్రైవర్‌ కు నిద్రొస్తే సీటే కనిపెట్టేస్తుంది!

సర్వీస్ సెంటర్‌కు షాక్.. ఇంట్లోనే EV బ్యాటరీని రిపేర్ చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి!

కియా సూపర్ సర్‌ ప్రైజ్.. ఏకంగా 8 ఎలక్ట్రిఫైడ్ మోడళ్లు వచ్చేస్తున్నాయ్!

టెస్లాకు చైనా షాక్.. 43 లక్షల కార్ల రీకాల్, అసలేం జరిగిందంటే?

చక్రాలు లేకుండా పరుగులు.. 4 కాళ్లతో నడిచే హైడ్రోజన్ రోబోట్ వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×