Yashasvi Jaiswal Warns Harsha Bhogle: శ్రీలంక వర్సెస్ టీమిండియా మధ్య ప్రస్తుతం రెండో టెస్టు కొలంబో వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. రెండో రోజు లంచ్ సమయానికి 419 పరుగులు చేసిన టీమిండియా 6 వికెట్లు నష్టపోయింది. మరో 80-90 పరుగులు చేసిన తర్వాత డిక్లేర్ చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో హర్ష భోగ్లే ( Harsha Bhogle)కు టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ( Yashaswi Jaiswal) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నోటికి వచ్చింది మాట్లాడితే పళ్ళు రాలగొడతానని హెచ్చరించారు. అసిత ఫెర్నాడోతో ( Asitha Fernando) గొడవ విషయంలో జైస్వాల్ ను హర్ష భోగ్లే తప్పుబట్టిన నేపథ్యంలో.. అతడికి తాజాగా టీమిండియా కుర్రాడు యశస్వి కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో 45 పరుగుల వద్ద కుర్రాడు యశస్వి జైస్వాల్ వికెట్ సమర్పించుకున్నాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 17వ ఓవర్ అసిత ఫెర్నాండో వేశాడు. అయితే ఈ ఓవర్ లో యశస్వి జైస్వాల్ వరుసగా మూడు బౌండరీలు సాధించాడు. దీంతో ఆవేశానికి లోనైనా ఫెర్నాండో…. సరైన బంతివేసి, యశస్వి జైస్వాల్ ను పెవిలియన్ కు పంపాడు. అక్కడితో ఆగకుండా వికెట్ తీసిన అత్యుత్సాహం ప్రదర్శించాడు. పెవిలియన్ కు వెళ్లే యశస్వి జైస్వాల్ ను బండ బూతులు తిట్టాడు ఫెర్నాడో. యంగ్ ప్లేయర్ అయిన నేపథ్యంలో వెంటనే యశస్వి జైస్వాల్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఫెర్నాడో వద్దకు వెళ్లి దా చూసుకుందాం అన్నట్లుగా బిహేవ్ చేశాడు. అంతలోనే అంపైర్లతో పాటు శ్రీలంక తోటి క్రికెటర్లు గొడవను చల్లార్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నిన్నటి నుంచి వైరల్ అవుతోంది.
ఫెర్నాండో వర్సెస్ యశస్వి జైస్వాల్ సంఘటనపై నిన్న హర్ష భోగ్లే స్పందించారు. ఈ సంఘటనలో యశస్వి జైస్వాల్ అదే తప్పు అంటూ విమర్శలు చేశారు. అవతలి వాడు గెలుకుతాడు.. గొడవ పెట్టుకుంటాడు.. కానీ మనకు కూడా సహనంగా ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. ఈ గొడవలో యశస్వి జైస్వాల్ ఎదురు తిరగకుండా సైలెంట్ గా వెళ్తే… ఇంత పెద్ద గొడవ కాకపోయేది అని వ్యాఖ్యానించారు.
అయితే హర్ష భోగ్లే చేసిన వ్యాఖ్యలకు వెంటనే యశస్వి జైస్వాల్ కూడా సోషల్ మీడియా వేదికగా సమాధానం ఇచ్చారు. గ్రౌండ్ లో ఏం జరిగిందో తెలియకుండా.. జడ్జి మెంట్ ఇవ్వకూడదని చురకలు అంటించారు. గిల్లితే గిల్లించుకోవడానికి నేను అమ్మాయిని కాదు… ఎదురు తిరుగుతానని హర్ష భోగ్లేకు కౌంటర్ ఇచ్చారు. ఫెర్నాండో అన్న మాటలకు ఎవడైనా రియాక్ట్ కావాల్సిందేనని స్పష్టం చేశారు. సంఘటన స్థలంలో ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడితే బెటర్ అని కౌంటర్ ఇచ్చారు.