BigTV English

Crocodile Attacks Boy| బాలుడిని ఒక్కసారిగా నోటితో పట్టుకన్న మొసలి.. పక్కనే ఉన్న గొర్రెల కాపరి ఏం చేశాడంటే?.

Crocodile Attacks Boy| బాలుడిని ఒక్కసారిగా నోటితో పట్టుకన్న మొసలి.. పక్కనే ఉన్న గొర్రెల కాపరి ఏం చేశాడంటే?.

Crocodile Attacks Boy| పశువులను కాసేందుకు నదీ తీరానికి వెళ్లిన ఓ 12 ఏళ్ల బాలుడిపై పెద్ద మొసలి దాడి చేసింది. బాలుడి ఎడమ చేయిని నోటితో పట్టుకొని నదిలో లాకెళ్లింది. ఇక అతను ఆ మొసలికి ఆహారమైపోయాడనుకుంటున్న సమయంలో ఆ భగవంతుడే బాలుడి కాపాడాడు. బాలుడితో వచ్చిన అతని స్నేహితులు, ఇతర గొర్రెల కాపరులంతా కలిసి నీళ్లలో దూకి అతడిని ప్రాణాలు కాపాడారు. మొసలితో పోరాడడానికి చాలా ధైర్యం కావాలి. అలాంటిది ఆ బాలుడి స్నేహితులు ప్రాణాలు లెక్క చేయకుండా నదిలోకి దూకి మొసలిని వెంబడించి మరీ పట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని సోన్ భద్ర జిల్లా లో జరిగింది.


స్థానిక మీడియా కథనం ప్రకారం.. సోన్ భద్ర జిల్లా.. పేఢ్ గ్రామానికి చెందిన అజిత్ అనే వ్యక్తి బర్రెలు, ఆవులున్నాయి. వాటికి గడ్డి మేపేందుకు అజిత్ కుమారుడు రమేష్ నదీతీరానికి వెళుతుంటాడు. అలా రమేష్ తన పశువులు తీసుకొని గ్రామంలోని భలువా బందీ నదీ తీరానికి వెళ్లాడు. రమేష్ తో పాటు గొర్రెలు మేపే అతని స్నేహితులు కూడా వచ్చారు.

Also Read: రూ.500 ఇంటి రెంటు..దుర్భర జీవితం.. కలలు సాకారం చేసేందుకు జొమాటో బాయ్ పోరాటం


అయితే ఆ పశువులలో ఒకటి గడ్డిమేస్తూ.. నది సమీపానికి వెళ్లిపోయింది. ఆ పశువును తిరిగి తీసుకువచ్చేందుకు వెళ్లిన రమేష్.. ఆ పక్కనే బుడదలో ఉన్న మొసలిని గమనించలేదు. తన పశువుని వెనక్కి తోలుకుంటూ పోతున్న సమయంలో ఒక్కసారిగా వెనుక నుంచి ఆ మొసలి రమేష్ కాలిని నోటితో గట్టిగా పట్టుకుంది. కానీ రమేష్ తన చేతిలో ఉన్న కర్రతో దాని తలపై కొట్టగా.. అది రమేష్ కాలిని వదిలేసి అతడి ఎడమ చేయిని గట్టిగా పట్టుకుంది. దీంతో రమేష్ తన స్నేహితులకు సాయం చేయమని కేకలు వేశాడు.

రమేష్ కేకలు విన్న అతని స్నేహితులు వెంటనే అక్కడికి వచ్చి మొసలి చూసి షాకయ్యారు. అయినా భయపడకుండా మొసలిని కర్రలతో బాదుతుండగా.. రమేష్ ని ఆ మొసలి నీళ్లలో పది అడుగుల దూరం వరకు తీసుకెళ్లింది. అయినా భయపడుకుండా రమేష్ స్నేహితులు, ఇతర గ్రామస్తులు మొసలిని వెంబడించి పట్టుకున్నారు. మొసలి నోట్లో ఒక ప్లాస్టిక్ పైపు నిలువుగా పెట్టి రమేష్ ని మొసలి నోటి నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నించారు. కానీ మొసలి వదల్లేదు. దీంతో వారంతా కర్రలతో రాళ్లతో మొసలిని కొట్టారు. చివరికి మొసలి రమేష్ ని వదిలిపెట్టి నీళ్లలోకి పారిపోయింది.

ఈ ఘటనలో రమేష్ చేతి ఎముకలు విరిగిపోయాయి. అతని కాలు, తొడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. రమేష్ వెంటనే గ్రామంలోని డాక్టర్ వద్దకు తీసుకువెళ్తే.. చేతికి ఆపరేషన్ చేయాలని సూచిస్తూ.. గ్రామ డాక్టర్లు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. రమేష్‌ని అతని కుటుంబ సభ్యులు.. సోన భద్ర జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం రమేష్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Also Read:  యూట్యూబర్ ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు.. పరువు నష్టం దావా వేసిన బిజేపీ నాయకుడు

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×