BigTV English

National Herald Rahul Gandhi: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్, సోనియాకు ఊరట.. ఈడీ ఛార్జిషీట్‌పై మండిపడిన కోర్టు

National Herald Rahul Gandhi: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్, సోనియాకు ఊరట.. ఈడీ ఛార్జిషీట్‌పై మండిపడిన కోర్టు

National Herald Rahul Gandhi| నేషనల్‌ హెరాల్డ్‌ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు జారీ చేసేందుకు నిరాకరించింది. కేసు ఛార్జిషీట్ లో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్ల లేవని ఎత్తిచూపుతూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై మండిపడింది. ముందు ఛార్జిషీట్ సరిగా ఫైల చేయాలని మిస్సింగ్ డాక్యుమెంట్స్ లేకుండా నోలీసులు జారీ చేయడం కుదరదని చెప్పింది.


ఈ కేసులో ఈడీ తరపున లాయర్ వాదిస్తూ.. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని (PMLA) నిబంధనల ప్రకారం.. ఆరోపణలను వినడానికి ముందు నిందితుల పక్షం వినాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే ఛార్జ్ షీటులో ప్రధాన నిందితులుగా ఉన్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు నోటీసులు జారీ చేయాలని కోరారు. అయితే ఢిల్లీ కోర్టు స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే.. నిందితులకు నోటీసు అవసరమని కోర్టు ఇంకా సంతృప్తి చెందలేదని, ఈడీ ఛార్జ్‌షీట్‌లో ఏదైనా లోపం ఉందా అని కోర్టు పరిశీలించాలని చెప్పారు.

“కోర్టు రికార్డ్ కీపర్ హైలైట్ చేసినట్లుగా ఛార్జ్‌షీట్‌లో కొన్ని డాక్యుమెంట్లు తప్పిపోయాయి. ఈడీ ఆ డాక్యుమెంట్లను సమర్పించాలని ఆదేశిస్తున్నాం. ఆ తర్వాతే నోటీసు జారీ చేయాలా? లేదా? అని దానిపై నిర్ణయం తీసుకుంటాం,” అని కోర్టు తెలిపింది. అయితే ఈడీ అధికారుల మాత్రం ఈ కేసులో తాము విచారణ చాలా పారదర్శకంగా చేస్తున్నామని ఏమీ దాచడం లేదని తెలిపారు. “మేము ఏమీ దాచడం లేదు. మనీ లాండరింగ్ ఆరోపణలను పరిగణలోకి తీసుకునే ముందు నిందితులకు వారి పక్షం వినిపించే అవకాశం ఇస్తున్నాము,” అని ఈడీ లాయర్ అన్నారు. కానీ కోర్టు మాత్రం నిందితులైన సోనియా గాంధీ, రాహుల గాంధీలకు నోటీసులు జారీ చేసేముందు ఛార్జ్‌షీట్‌లో కొన్ని లోపాలను సరిచేయమని సంబంధిత కీలక డాక్యుమెంట్లను సమర్పించమని ఈడీని సూచించింది.


Also Read: పాకిస్తానీలందరూ ఇండియా వదిలి వెళ్లిపోవాలి.. మరి ఇండియాలో కాపురం పెట్టిన సీమా హైదర్ పరిస్థితేంటి.. 

గాంధీలపై ఉన్న ఆరోపణలు ఏంటి?
మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు.. శామ్ పిట్రోడా (కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ విభాగం అధిపతి), సుమన్ దుబే (గాంధీ కుటుంబానికి సన్నిహితుడు, మాజీ జర్నలిస్ట్) కూడా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐ) సంస్థ స్థాపన డైరెక్టర్లుగా పేర్కొనబడ్డారు. సోనియా, రాహుల్ గాంధీలు.. ఈ కంపెనీలో 76 శాతం వాటా కలిగి ఉన్నారు, అయితే ఈ సంస్థ ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

మనీలాండరింగ్ లో గాంధీలను ఈడీ అధికారులు ప్రధాన నిందితులుగా ఆరోపించారు. ఈ కంపెనీ.. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక యొక్క మాతృ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు సంబంధించిన ఆస్తులను కేవలం ₹50 లక్షలకు స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. ఈడీ ప్రకారం.. ఈ ఆస్తుల విలువ అప్పట్లో ₹2,000 కోట్లు, ప్రస్తుతం సుమారు ₹5,000 కోట్లుగా ఉంది.

ఈడీ ఫైల్ చేసిన ఛార్జ్‌షీట్ ప్రకారం.. కంపెనీలో మొత్తం ₹988 కోట్ల అక్రమ ఆదాయం గుర్తించనట్లు సమాచారం. ఇందులో ₹755 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్, ఇతర ఆస్తులు, ₹90 కోట్ల విలువైన షేర్లు, ₹142 కోట్ల అద్దె ఉన్నాయి. ఈ అద్దెను ఏజేఎల్ తన ఢిల్లీ, ముంబై, ఇండోర్, పంచకుల, లక్నో, పాట్నా వంటి నగరాల్లోని ఆస్తుల నుండి 2010-11 ఆర్థిక సంవత్సరంలో సంపాదించగా.. రాహుల్ గాంధీకి చెందిన యంగ్ ఇండియా సంస్థ దాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకుందని ఆరోపణలున్నాయి.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×