Pahalgam Terror Attack Seema Haider| జమ్మూ కశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి తరువాత భారత ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశంలో నివసించే పాకిస్తానీలు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ప్రకటించింది. పైగా పాకిస్తాన పౌరులకు దేశంలో ప్రవేశించడంపై నిషేధం విధించింది. బుధవారం ఫారిన్ సెక్రటరీ మీడియా సమావేశం ఈ ప్రకటన చేశారు. జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల చేసిన దాడిలో 26 మంది అమాయక పర్యటకులు, వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఒక ముస్లిం స్థానికుడు చనిపోయాడు. చనిపోయిన వారిలో ఇద్దరు విదేశీ పౌరులు కూడా ఉండడం గమనార్హం.
అయితే ఈ ఘటనలో పాకిస్తాన్ ప్రభుత్వం హస్తం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పౌరులను దేశంలో ప్రేవేశించడంపై నిషేధం విధించింది. దీంతో పాటు దేశంలో ఇప్పటికే నివసించే పాకిస్తానీ పౌరులందరూ 48 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని చెప్పింది. ఇప్పడు ఈ రెండో నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంత తక్కువ వ్యవధిలో దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసించే పాకస్తానీలు ఎలా అంత త్వరగా వెళ్లిపోగలరని పలు మాధ్యమాల్లో డిబేట్ జరుగుతోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ నుంచి తన భర్తను వదిలి ఇండియా వచ్చేసిన సీమా హైదర్ అనే మహిళ ఒక భారతీయుడిని పెళ్లి చేసుకొని ఇక్కడే నివసిస్తోంది. ఆమె అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించి గత రెండు సంవత్సరాలుగా ఉంటోంది. పైగా ఆమె ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పాకిస్తానీలు దేశం వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించడంతో సీమా హైదర్ కూడా వెళ్లిపోవాల్సిందేనా అనే చర్చ వైరల్ అవుతోంది. సీమా హైదర్ 32 అనే మహిళ పాకిస్తాన్ లోని సింధ్ రాష్ట్రం జకోబాబాద్ కు చెందినది. ఆమెకు నలుగురు పిల్లులున్నారు. ఆమె భర్త దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆమె ఆన్ లైన్ లో వీడియో గేమ్ ఆడుతూ ఒక భారత యువకుడు సచిన్ మీణాతో ప్రేమలో పడింది. అంతే తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా ఇండియాలో ప్రవేశించింది. ఆ తరువాత ఢిల్లీ సమీపంలోని నోయిడా ప్రాంతంలో సచిన్ మీణాతో కలిసి నివసిస్తోంది. అయితే ఈ విషయం మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఇండియాలోనే ఉండేందుకు భారత ప్రభుత్వాన్ని కోరింది. పైగా భారతీయుడైన తన ప్రేమికుడిని పెళ్లాడి ఇటీవలె అతడి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇంతవరకూ ఆమెకు భారత పౌరసత్వం లభించలేదు. మరోవైపు ఆమె పాకిస్తానీ భర్త కూడా తన భార్య తిరిగి రావాలని న్యాయ పోరాటం చేస్తున్నాడు.
Also Read: ఐపిఎల్ చూస్తూ ప్రమాదవశాత్తు తుపాకీ పేల్చిన బాలుడు.. పొరుగింటి వ్యక్తి మృతి
ఈ క్రమంలో ఇప్పుడు భారత ప్రభుత్వం పాకిస్తానీలను దేశం విడిచి పెట్టి వెళ్లిపోవాలని ఆదేశించడంతో సోషల్ మీడియాలో నెటిజెన్లు తెగ చర్చించుకుంటున్నారు. చాలా మంది నెటిజెన్లు ఆమెను ఇక్కడి నుంచి పంపించేయాలని అదే న్యాయమని కామెంట్లు చేస్తుండగా.. కొందరు మాత్రం ఆమె ఇక్కడే ఉండడం న్యాయమని అంటున్నారు.