Delhi Election Results Kejriwal : దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కనిపిస్తున్నప్పటికీ.. ఆధిక్యాల్లో బిజేపీ-ఆప్ మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. ఉదయం 9.50 గంటల వరకు వెలువడిన ఫలితాలను (Assembly Elections) చూస్తుంటే.. ఆధిక్యాల్లో బిజేపీ మ్యాజిక్ ఫిగర్ (36)ను దాటింది. ప్రస్తుతం కమలం పార్టీ 39 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఆప్ (AAP) 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఉదయం కౌంటింగ్ తొలి రౌండ్ లో వెనుకంజలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర కుమార్ జైన్, మనీష్ సిసోదియా.. మళ్లీ పుంజుకొని ఆధిక్యంలో కొనసాగుతుండడం విశేషం. అయినా మొత్తంగా చూస్తే ఇప్పటివరకు బిజేపీ హవా కొనసాగుతోంది. అయితే ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి సింగ్ కాల్కాజీ నియోజకవర్గం నుంచి వెనుకంజలోనే ఉన్నారు. కేజ్రీవాల్ (Kejriwal) ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సిటులోనే పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. కౌంటింగ్ ప్రారంభంలో ఒక నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ ఆ తరువాత ఆ స్థానంలో కూడా పట్టుకోల్పోయింది. (Delhi Assembly Election Results 2025). మొత్తం 70 అసెంబ్లీ స్థానాల ఓట్ల కౌంటంగ్ జరుగుతోంది.
ప్రముఖుల ఫలితాల సరళి ఎలా ఉందంటే..
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ముందంజలోకి వచ్చారు. ఆ నియోజకవర్గంలో బిజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పర్వేజ్ సాహిబ్ సింగ్ ప్రారంభంలో దూకుడు చూపించినా ఆ తరువాత క్రమంగా వెనుకంజలో కొనసాగుతున్నారు.
కాల్కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం ఆతిషీ వెనుకంజ
జంగ్పురలో మనీష్ సిసోదియా ముందంజ
షాకుర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్ ముందంజ
ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానతుల్లా ఖాన్ వెనుకంజ
గాంధీనగర్లో బిజేపీ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ ముందంజ
బద్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ వెనుకంజ.. తొలి రౌండ్లలో ఆయన ఆధిక్యంలో కనిపించారు.
బిజ్వాసన్ స్థానంలో బిజేపీ అభ్యర్థి కైలాష్ గహ్లోత్ ముందంజ
పట్పర్గంజ్లో ఆప్ అభ్యర్థి ప్రముఖ విద్యావేత్త అవధ్ ఓజా వెనుకంజ
గ్రేటర్ కైలాష్లో ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ ముందంజ